మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్: లాంచ్ తేదీ, ధర, ఫీచర్ల వరకు మీరు తెలుసుకోవలసినవి ఇవే..

By Ashok kumar SandraFirst Published Feb 16, 2024, 1:17 PM IST
Highlights

నథింగ్ ఫోన్ 2(a) వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ ఫోన్ 2(a) మార్చి 5న విడుదల కానుంది. ఈ ఫోన్ (1)కి సక్సెసర్‌గా రానుంది. లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ నథింగ్ రాబోయే మిడ్-రేంజ్ ఆఫర్‌తో గొప్ప సెన్సేషన్  సృష్టించింది.

 ఫీచర్లు
నథింగ్ ఫోన్ 2(a) 6.7-అంగుళాల OLED ప్యానెల్, డ్యూయల్ కెమెరాలు, MediaTek  డైమెన్సిటీ 7200 SoC, 8GB RAM అండ్  128GB స్టోరేజీ  ఉంటుందని భావిస్తున్నారు.  ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ OS 2.5లో రన్ అవుతుంది. ఇతర నథింగ్ డివైజెస్లకు అనుగుణంగా ఫోన్ ట్రాన్సరెంట్ బ్యాక్ డిజైన్‌తో ఉంటుంది.  

నథింగ్ ఫోన్ 2(a) వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. డివైజ్  120Hz రిఫ్రెష్ రేట్‌తో గణనీయమైన 6.7-అంగుళాల డిస్‌ప్లే  ఉంటుందని భావిస్తున్నారు.

 నథింగ్ ఫోన్ 2(a) MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌తో  ఉంటుందని పుకారు ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,500mAh నుండి 4,800mAh వరకు ఉండొచ్చు.

సాఫ్ట్‌వేర్ చూస్తే  ఫోన్ 2(a) ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ OS 2.5లో రన్ అయ్యే అవకాశం ఉంది.  ఈ ఫోన్ లాంచ్ తర్వాత మూడు సంవత్సరాల వరకు ఫోన్ అప్‌డేట్‌లను అందుకుంటుందని భావిస్తున్నారు.

 ధర
ఈ డివైజ్ రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో, బేస్ మోడల్ 8GB ర్యామ్  అండ్  128GB స్టోరేజ్‌తో రావచ్చు. ధరల పరంగా, ఇటీవలి లీక్ ఐరోపాలో ధర 349 యూరోలుగా ఉంటుందని సూచించింది, అంటే దాదాపు రూ. 31,000  ఉంటుంది. నివేదిక ప్రకారం, భారతదేశంలో దీని ధర సుమారు రూ. 30,000 ఉండవచ్చు. 

click me!