రెండు డిస్ ప్లేలు, 4జి కనెక్టివిటీతో ఫ్లిప్ ఫోన్‌.. ఇండియన్ మార్కెట్లోకి రిఎంట్రీ..

By asianet news telugu  |  First Published Aug 31, 2022, 11:27 AM IST

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ని ప్రీమియం డిజైన్‌తో పరిచయం చేసారు. ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4G కనెక్టివిటీ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఈ ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు కనిపిస్తాయి.


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నోకియా కొత్త ఫీచర్ ఫోన్ నోకియా 2660 ఫ్లిప్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 4G LTE కనెక్టివిటీతో పరిచయం చేసింది. నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్‌లో ఇచ్చారు. నోకియా 2660 ఫ్లిప్‌లో రెండు డిస్‌ప్లేలు కనిపిస్తాయి. దీనితో పాటు Unisoc T107 ప్రాసెసర్, 48ఎం‌బి ర్యామ్‌తో ఈ ఫోన్‌లో 128ఎం‌బి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఇచ్చింది. ఫోన్ ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి చూద్దాం...

నోకియా 2660 ఫ్లిప్ ధర 
నోకియా 2660 ఫ్లిప్ బ్లాక్, బ్లూ ఇంకా రెడ్ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు. 48ఎం‌బి ర్యామ్ 128ఎం‌బి స్టోరేజ్ ధర రూ. 4,699. ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. 

Latest Videos

undefined

నోకియా 2660 ఫ్లిప్ స్పెసిఫికేషన్స్ అండ్ కెమెరా
నోకియా నుండి వస్తున్న ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో పరిచయం చేశారు. ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4G కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. ఫోన్ రెండు డిస్ ప్లేలతో వస్తుంది, QVGA రిజల్యూషన్‌తో 2.8-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, QQVGA రిజల్యూషన్‌తో 1.77-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే ఉంది. Unisoc T107 ప్రాసెసర్, 48ఎం‌బి ర్యామ్‌తో ఫోన్‌లో 128ఎం‌బి ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే  0.3 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, ఇంకా LED ఫ్లాష్‌తో వస్తుంది. 

నోకియా 2660 ఫ్లిప్ బ్యాటరీ
ఈ ఫోన్ లో 1450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది, 2.75W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బ్యాటరీకి సంబంధించి స్టాండ్‌బై మోడ్‌లో సింగిల్ 4G సిమ్‌తో 24.9 రోజులు రన్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది, సాధారణంగా 6.5 గంటల టాక్ టైమ్‌ను పొందుతుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v4.2, మైక్రో-USB 2.0 పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ అందించారు. 
 

click me!