ఇలా కూడా స్టేటస్ అప్‌డేట్ చేయవచ్చు.. వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్..

By Ashok kumar Sandra  |  First Published Dec 26, 2023, 6:21 PM IST

WhatsApp ఇప్పుడు కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది, ఈ ఫీచర్ తో WhatsApp వెబ్ వెర్షన్ నుండి కూడా స్టేటస్ అప్ డేట్ చేయవచ్చు. వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ఇప్పటికే ప్రారంభించింది.
 


స్మార్ట్ ఫోన్  నుండి వాట్సాప్‌లో స్టేటస్‌ని అప్‌డేట్ చేయడంలో మీకు సమస్య ఉంటే, మీకో  గుడ్ ఞన్యూస్. WhatsApp ఇప్పుడు కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది, ఈ ఫీచర్ వచ్చిన తర్వాత WhatsApp వెబ్ వెర్షన్ నుండి కూడా స్టేటస్ అప్ డేట్ చేయవచ్చు. వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ఇప్పటికే  ప్రారంభించారు.

 బీటా వినియోగదారులుగా ఉన్న యూజర్లు  ఈ ఫీచర్‌ని  యాప్ అండ్ వెబ్‌లో చూడవచ్చు. ఈ ఫీచర్ WhatsApp కంపానియన్ మోడ్‌లో ఒక భాగం, ఈ ఫీచర్ యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్ లో ఒకే అకౌంట్కు  లాగిన్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ మోడ్‌లో ప్రైమరీ ఫోన్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.

Latest Videos

WhatsApp ఈ కొత్త ఫీచర్ WhatsApp వెబ్ బీటా వెర్షన్ 2.2353.59లో కనిపించింది. ఈ కొత్త ఫీచర్ గురించిన సమాచారం WABetaInfo ద్వారా అందించబడింది. మీరు మీ ప్రైమరీ అకౌంట్లు లాగిన్ చేసిన నాలుగు డివైజెస్ లో కొత్త ఫీచర్ పని చేస్తుంది. 

కొత్త అప్‌డేట్ తర్వాత, వాట్సాప్ వినియోగదారులు  ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ నుండి కూడా స్టేటస్ అప్‌డేట్ చేయగలుగుతారు. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.1.4లో కొత్త ఫీచర్‌ను చూడవచ్చు. ప్రస్తుతం WhatsApp స్టేటస్ ప్రైమరీ డివైజ్ లేదా మొబైల్ నుండి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు.

click me!