Motorola G52 launched: pOLED డిస్‌ప్లే ఫీచర్‌తో Moto G52 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధ‌ర ఎంతంటే..?

By team telugu  |  First Published Apr 25, 2022, 4:02 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. Motorola Moto G52 కొత్త స్మార్ట్‌ఫోన్‌ OLED డిస్‌ప్లేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయింది. ఈ ఫోన్‌లో 5G సపోర్ట్ లేదు. 
 


మోటోరోలా కంపెనీ G-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Moto G52 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉండటంతో పాటు సరసమైన ధరలోనే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను pOLED డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. దృశ్యం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్‌లో Moto G52 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత సన్నని, సొగసైన డిజైన్ కలిగింది, ఎంతో తేలికైనది అని కంపెనీ పేర్కొంది. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ సరికొత్త Moto G52లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి..!

Motorola Moto G52 ధర

Latest Videos

undefined

Motorola Moto G52 ధర 4GB RAM వేరియంట్‌కు రూ. 14,499గా నిర్ణయించింది. 6GB వేరియంట్‌కు రూ. 16,499గా నిర్ణయించింది. మే 3న ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Moto G52 ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కానుంది. అడ్వాన్స్ లేదా EMI చెల్లింపుల కోసం HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉపయోగిస్తే.. మీరూ రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. Moto G52 పింగాణీ వైట్ చార్కోల్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది.

Moto G52 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్ల వారీగా చూస్తే.. Moto G52 బడ్జెట్ ఫోన్‌గా వచ్చింది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.61 అంగుళాల పూర్తి pOLED FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో ప‌ని చేస్తుంది. టాప్ కార్నర్ మధ్యలో పంచ్-హోల్ అందించారు. అందులో లోపల 16-MP సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC పవర్ అందిస్తోంది. గరిష్టంగా 6GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. Moto G52 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని అమర్చారు.

Motorola G52 కంపెనీ MyUX స్కిన్‌తో Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. Moto G52లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. Moto G52 వెనుక 50-MP ప్రధాన కెమెరా ఉంది. 8-MP అల్ట్రావైడ్ కెమెరా, 2-MP డెప్త్-సెన్సింగ్ కెమెరాతో వస్తోంది. ఈ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్ కూడా అందించారు. ఫోన్ IP52-రేటెడ్ బాడీతో వస్తోంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. Moto G52 పోర్సిలైన్ వైట్, చార్‌కోల్‌ గ్రే అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మే 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
 

click me!