చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ విపణిలోకి మరో స్మార్ట్‌ఫోన్ తీసుకురానున్నది. వెనుక వైపు 5 కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రోను వచ్చేనెల ఐదో తేదీన 5న విడుదల చేయనుంది. భారత్ విపణిలోకి ఈ ఫోన్‌ను ఎంఐ ఏ3 ప్రో పేరుతో రానున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ఫోన్లు అందించే చైనా దిగ్గజం షియోమీ నుంచి మరో కొత్త మొబైల్ రానున్నది. 5 బ్యాకప్ కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను వచ్చేనెల ఐదో తేదీన విపణిలోకి విడుదల చేసేందుకు షియోమీ సిద్ధమైంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి ఫీచర్లను షియోమీ వెల్లడించలేదు గానీ మీటూ సంస్థ భాగస్వామ్యంలో వచ్చిన సీసీ స్మార్ట్ఫోన్ల సిరీస్‌లో సీసీ9 ప్రో మూడోది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో సీసీ9, సీసీ9ఈ ఫోన్లను విడుదల చేసింది షియోమీ.
భారత్‌లో ఏ3 ప్రో సీసీ9ఈను ప్రపంచ మార్కెట్లో ఎంఐ ఏ3 ఆండ్రాయిడ్ వన్ పేరుతో విడుదల చేసింది. సీసీ9 ప్రోను ఏ3 ప్రోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ రామ్, 8 జీబీ ర్యామ్ విత్128జీబీ రామ్, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ రామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.
undefined
also read ఇక వార్ జియో x ఎయిర్టెల్ మధ్యే...
అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. సీసీ9 ప్రోలో కెమెరాపై ప్రధానంగా దృష్టి సారించింది షియోమీ. వెనుకవైపు 5 కెమెరాలను పొందుపరిచింది. ప్రధాన కెమెరాలో శామ్సంగ్ రూపొందించిన 108 మెగాపిక్సల్ సెన్సార్‌ను అమర్చింది.
ఫొటో బ్యాక్‌గ్రౌండ్ స్పష్టత కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్లనూ పొందుపరిచింది.ఒప్పో రెనో ఫోన్ల తరహాలో 5 రెట్లు ఆప్టికల్ జూమ్ ఆప్షన్ కూడా ఇచ్చింది షియోమీ. మార్కెట్లో ప్రస్తుతానికి 5 కెమెరాలున్న స్మార్ట్ ఫోన్ నోకియా 9 ప్యూర్‌వ్యూ మాత్రమే.
also read ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్.. ప్రపంచమంతా అక్కడే
ఎంఐ సీసీ 9 ప్రో మోడల్ స్మార్ట్ పోన్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ తోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ చిప్సెట్ గల ఈ ఫోన్ వెనుక 108ఎంపీ సామర్థ్యం గల కెమెరా ఉంటుంది. అలాగే 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అమర్చారు. ఈ ఫోన్ 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఇప్పటికి సంస్థ ఫోన్ ధర ఎంతో ప్రకటించలేదు కానీ.. భారత విపణిలో రూ.16 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండొచ్చని అంచనా.