గూగుల్ యాప్స్ లో కొత్త మాల్వేర్.. ఈ 8 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలెట్ చేయండి..

By asianet news telugu  |  First Published Jul 18, 2022, 9:04 AM IST

సెక్యూరిటి రిసర్చర్ ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్‌లలో కొత్త మాల్వేర్ వచ్చి చేరింది, ఈ మాల్వర్ వినియోగదారులకు తెలియకుండానే ప్రీమియం సర్వీసెస్ సబ్ స్క్రిప్షన్ ఇస్తుంది. 


అండ్రాయిడ్ యాప్ స్టోర్ Google యాప్ స్టోర్‌లో ఉన్న యాప్స్ లో కొత్త మాల్వేర్ కనుగొనబడింది. సెక్యూరిటి రిసర్చర్ ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్‌లలో కొత్త మాల్వేర్ వచ్చి చేరింది, ఈ మాల్వర్ వినియోగదారులకు తెలియకుండానే ప్రీమియం సర్వీసెస్ సబ్ స్క్రిప్షన్ ఇస్తుంది. ఈ మాల్వేర్ పేరు ఆటోలికోస్. ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఎనిమిది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించారు. 

 పర్సనల్ డేటా హ్యాక్ 
సైబర్ సెక్యూరిటీ సంస్థ అవెనాకు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ మాగ్జిమ్ ఇంగ్రావ్ ఈ మాల్వేర్ గురించి ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. ఆటోలికోస్ అనే మాల్వేర్ కనుగొనబడిందని, ఈ మాల్వేర్ గూగుల్ యాప్ స్టోర్‌లోని ఎనిమిది యాప్‌లలో ఉందని ట్వీట్ చేశారు. Autolycos వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, డేటాను దొంగిలిస్తుంది, ఈ మాల్వేర్ కూడా మీకు తెలియకుండానే మీ SMSని రీడింగ్ చేస్తోంది. Autolycos రిమోట్ బ్రౌజర్‌లో URLని అమలు చేస్తుంది అలాగే WebView లేకుండా HTTP రిక్వెస్ట్ ఆమోదిస్తుంది.

Latest Videos

undefined

ఎనిమిది యాప్స్ 
పరిశోధకుల ప్రకారం, ఈ మాల్వేర్ Google Play Store క్రియేటివ్ 3D లాంచర్, Gif ఎమోజి కీబోర్డ్, Vlog స్టార్ వీడియో ఎడిటర్, Wow Beauty Camera, Freeglow Camera, Coco Camera v1.1 వంటి యాప్‌లలో కనుగొనబడింది. ప్లే స్టోర్ నుంచి కూడా 30 లక్షల మందికి పైగా ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మీ మొబైల్‌లో ఈ యాప్‌లలో ఏవైనా ఉంటే వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అయితే, ఇప్పుడు ఈ యాప్‌లను Google Play Store నుండి తీసివేయబడ్డాయి. 

మీ మొబైల్‌లో కూడా ఈ యాప్‌లు ఉన్నట్లయితే, ఈ యాప్‌ను తీసివేయడానికి మీరు ఆండ్రాయిడ్ డివైజ్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఆ తర్వాత యాప్ సెక్షన్ కి వెళ్లండి. అక్కడ, యాప్ లిస్ట్ చెక్ చేయండి ఇంకా సమాచారం లేని యాప్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి లేదా ఫోర్స్ స్టాప్ చేయండి. దీని తర్వాత, ఫైల్ మేనేజర్‌కి వెళ్లి, ఆ యాప్‌తో అనుబంధించబడిన అన్ని ఫైల్‌లను డిలెట్ చేయండి.

click me!