30 సెకన్లలో 5 లక్షల వరకు లోన్; ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కస్టమర్లకు పర్సనల్ లోన్ కూడా అందిస్తోంది..

By asianet news teluguFirst Published Jul 8, 2023, 5:45 PM IST
Highlights

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు  లోన్  మంజూరు చేయడానికి కేవలం 30 సెకన్లు పడుతుందని ఇంకా 30 సెకన్లలో రూ. 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కస్టమర్లకు పర్సనల్ లోన్  కూడా అందించనుంది. Flipkart డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పర్సనల్ లోన్ అందించడానికి ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు  లోన్  మంజూరు చేయడానికి కేవలం 30 సెకన్లు పడుతుందని ఇంకా 30 సెకన్లలో రూ. 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

 ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు ఆరు నుంచి 36 నెలల రీపేమెంట్ వ్యవధితో రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అంటే, వెబ్‌సైట్‌లో అందించిన వివరాల ప్రకారం, మీరు కళ్ళు తెరిచినంత వేగంగా రుణం ఆమోదించబడుతుంది. కంపెనీ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది.  

ఫ్లిప్‌కార్ట్ లోన్ అప్లికేషన్ కోసం ఎం  చేయాలి

పర్సనల్ లోన్  కోసం దరఖాస్తు చేయడానికి పాన్ నంబర్ (పెర్మనెంట్ ఆకౌంట్  నంబర్), పుట్టిన తేదీ ఇంకా కస్టమర్  ఉద్యోగ వివరాలు వంటి ప్రాథమిక వివరాలు అవసరం. అవసరమైన వివరాలను అందించిన తర్వాత, యాక్సిస్ బ్యాంక్ వారి లోన్  లిమిట్ ఆమోదిస్తుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు వారి ప్రతినెలా రీపేమెంట్ కెపాసిటీ ఆధారంగా వారి ఇష్టపడే లోన్ మొత్తాన్ని ఇంకా రీపేమెంట్ పద్ధతిని ఎంచుకోవచ్చు.

లోన్ దరఖాస్తును ఆమోదించే ముందు, ఫ్లిప్‌కార్ట్ రీపేమెంట్ వివరాలతో సహా కొన్ని నిబంధనలు, షరతులను ప్రవేశపెడుతుంది. వ్యక్తిగత రుణ సౌకర్యం ద్వారా కస్టమర్ల కొనుగోలు శక్తిని పెంచడమే లక్ష్యం అని ఫ్లిప్‌కార్ట్ ఫిన్‌టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా తెలిపారు.

click me!