అమెజాన్‌ భారీ ఆఫర్...ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10000 తగ్గింపు

By Arun Kumar P  |  First Published Jan 19, 2019, 5:25 PM IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బంఫర్ ఆపర్ ప్రకటించింది. ఇప్పటికే జనవరి 20 నుంచి 23 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్పెషల్‌ విక్రయాలను చేపట్టనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. అయితే అంతకంటే ముందే ఓ స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రూ.10000వేల తగ్గింపు ధరకు అందించనున్నట్లు ప్రకటించి అమెజాన్ సంచలన సృష్టించింది. 
 
ఎల్‌జి కంపనీ ప్రత్యేక ఫీచర్లతో ముఖ్యంగా సెల్పీ ప్రియులను ఆకట్టుకునేలా వీ40థింక్యూ పేరిట ఓ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది.  మొత్తంగా ఐదు కెమెరాలతో(ముందువైపు రెండు, వెనుకవైపు  మూడు) వినియోగదారులను అకట్టుకునేలా ఈ ఫోన్ ను ఎల్‌జి రూపొందించింది. ఇలా  మరిన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.60 వేలకు లభిస్తుండగా...అమెజాన్ లో కేవలం రూ.49,900 కు అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్‌ సభ్యత్వం కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుందని ఈ సంస్థ ప్రకటించింది. 

Latest Videos

ఈ ఎల్‌‌జి వీ40థింక్యూ ఫోన్ 6.40 ఇంచెస్‌తో పెద్ద డిస్‌ప్లే ను కలిగివుండటంతో పాటు ఇందులో ఆండ్రాయిడ్‌ 9పై ఉపయోగించారు. అలాగే స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌, 1440x3120  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8+5 ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా,12+12+16ఎంపి రియర్‌ కెమెరా,3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో వుంది. దీన్ని అమెజాన్ సంస్థ  ఆఫర్ ప్రైజ్ లో ఆన్ లైన్ ద్వారా  అమ్మడానికి సిద్దమైంది. 
 
సంబంధిత వార్తలు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ...స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు

ఆన్ లైన్ షాపింగ్ సైట్లకి జియో షాక్...ముకేశ్ అంబాని ప్రకటనతో

click me!