ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi రెడ్‌మి బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. Redmi Note 11 Pro, Redmi Note 11 Pro+ రెండు వేరియంట్లు భారత మార్కెట్లో మార్చి 9న లాంచ్ కానున్నాయి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi రెడ్‌మి బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. Redmi Note 11 Pro, Redmi Note 11 Pro+ రెండు వేరియంట్లు భారత మార్కెట్లో మార్చి 9న లాంచ్ కానున్నాయి. ఈ మేరకు కంపెనీ రెడ్‌మి ఇండియా ధృవీకరించింది. గత కొన్ని రోజులుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ డివైజ్ కెమెరా స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. Redmi Note 11 Pro, Redmi Note 11 Pro+ వచ్చే నెల రెండవ వారంలో లాంచ్ అవుతాయని వెల్లడించింది.
రెడ్‌మి ఇప్పటికే Note 11, Note 11Sలను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు Redmi Pro మోడల్స్ లైనప్‌కు మెరుగైన ఫీచర్లను తీసుకొస్తోంది. Redmi Note 11 సిరీస్ గత ఏడాది చైనాలో ఫిబ్రవరి ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. Xiaomi 11i సిరీస్‌లో భాగంగా మరిన్ని చైనీస్ వేరియంట్‌లను గ్లోబల్ వేరియంట్‌లను భారత్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. Redmi Note 11 Pro మోడల్స్ మార్చి 9న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌లను ఆవిష్కరించేందుకు Redmi ఆన్‌లైన్ ఈవెంట్‌ను హోస్ట్ చేయనుంది.
Redmi Note 11 Pro, Note 11 Pro+ ఫీచర్లు
Redmi Note 11 Pro గ్లోబల్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67 ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 6GB/8GB RAM, 64GB/128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. MediaTek Helio G96 చిప్‌సెట్ అందిస్తోంది. ఈ రెండు మోడళ్లలో స్టోరేజీని Micro SD కార్డ్ ఉపయోగించి 1TB వరకు ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లోని క్వాడ్ వెనుక కెమెరా 108-MP ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రావైడ్ లెన్స్, 2-MP డెప్త్ సెన్సార్ 2-MP మాక్రో కెమెరాను కలిగి ఉండనుంది. ఫ్రంట్ సైడ్ 16-MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తోంది. Redmi Note 11 Pro Android 11-ఆధారిత MIUI 13 స్కిన్ ఇంటర్ ఫేస్‌తో రానుంది.
Pro+ మోడల్‌లో ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 695 చిప్ 5G కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. కెమెరా సిస్టమ్ 3 సెన్సార్‌లతో మాత్రమే రానుంది. Redmi Note 11 Pro+ Redmi Note 11 Pro రెండు ఫోన్ల ధర రూ. 16,499 ఉండొచ్చునని అంచనా. మరో రెడ్ మి మోడల్ Xiaomi 11i ధర రూ. 24,999 కన్నా తక్కువగా ఉంటుందని అంచనా. అయితే ఈ రెడ్‌మి ప్రో స్మార్ట్ ఫోన్ల ధర దాదాపు రూ. 20,000 వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై రెడ్ మి ఇండియా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మార్చి 9న లాంచ్ అయ్యాక ఈ రెండు మోడళ్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంత అనేది క్లారిటీ రానుంది.