Jio Cheapest Plan:రోజుకు 1.5జి‌బి డేటాతో జియో చౌక ప్లాన్.. ప్రారంభ ధర రూ. 119 మాత్రమే..

Ashok Kumar   | Asianet News
Published : Apr 14, 2022, 01:10 PM IST
Jio Cheapest Plan:రోజుకు 1.5జి‌బి డేటాతో జియో చౌక ప్లాన్.. ప్రారంభ ధర రూ. 119 మాత్రమే..

సారాంశం

రోజుకు 1.5జి‌బి డేటాతో జియో రెండవ ప్లాన్ ధర  రూ.199. ఈ ప్లాన్ వాలిడిటీ 23 రోజులు. ఇందులో రోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉంటాయి. 

రిలయన్స్ జియోలో రోజుకు 1.5జి‌బి డేటాతో ఎన్నో ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి, అయితే వినియోగదారులందరికీ అన్ని ప్లాన్‌ల గురించి పూర్తిగా తెలియదు. జియో  1.5జి‌బి డేటా పర్ డే ప్లాన్  ప్రారంభ ధర రూ. 119 కాగా, అత్యంత ఖరీదైన ప్లాన్ ధర రూ. 2,545. రోజుకు 1.5జి‌బి డేటాతో జియో టాప్-5 ప్రీ-ప్లాన్ గురించి తెలుసుకుందాం...

జియో రూ.119 ప్లాన్
ఈ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 1.5జి‌బి డేటా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు అంటే మీరు ఇందులో మొత్తం 21జి‌బి డేటాను లభిస్తుంది. డేటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64kbps ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, మొత్తం 300 ఎస్‌ఎం‌ఎస్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.

రోజుకు 1.5జి‌బి డేటాతో జియో రెండవ ప్లాన్ ధర  రూ.199. ఈ ప్లాన్ వాలిడిటీ 23 రోజులు. ఇందులో రోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉంటాయి. ఇంకా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్‌తో జియో యాప్‌లకు యాక్సెస్ కూడా అందిస్తుంది.

రోజుకు 1.5జి‌బి డేటాతో జియో మూడవ ప్లాన్ రూ. 239. ఈ ప్లాన్‌ 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. దీనిలో మీరు రోజుకు 1.5జి‌బి డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMSలను పొందుతారు. 

జియోలో రూ. 479 అండ్ రూ. 666 ప్లాన్‌లు కూడా ఉన్నాయి, వీటిలో ప్రతిరోజూ 1.5జి‌బి డేటా వస్తుంది. ఈ ప్లాన్‌ల వాలిడిటీ 56 రోజులు మరొకటి 84 రోజులు. Jioలో కూడా రూ. 2,545 ప్లాన్‌ ఉంది, దీనిలో ఆన్ లిమిటెడ్ కాలింగ్, 1.5జి‌బి డేటా ప్రతిరోజూ 336 రోజుల వాలిడిటీ ఉంటుంది.
 

PREV
click me!

Recommended Stories

Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్
Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర