Jio calendar month validity: జియో నుంచి మరో కొత్త ప్లాన్.. రూ.259 రీఛార్జ్ చేస్తే బెనిఫిట్స్ ఇవే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 29, 2022, 04:56 PM IST
Jio calendar month validity: జియో నుంచి మరో కొత్త ప్లాన్.. రూ.259 రీఛార్జ్ చేస్తే బెనిఫిట్స్ ఇవే..!

సారాంశం

జియో యూజ‌ర్ల‌కు మ‌రో శుభ‌వార్త‌. జియో యూజ‌ర్ల కోసం మ‌రో స‌రికొత్త ప్లాన్ ప్ర‌క‌టించింది. క్యాలెండ‌ర్ మంత్ వ్యాలిడిటీ అనే పేరుతో మ‌రో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. అదేంటో చూద్దాం..!  

జియో యూజర్లకు శుభవార్త. యూజర్ల కోసం మరో కొత్త ప్లాన్ ప్రకటించింది రిలయన్స్ జియో (Reliance Jio). 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో రూ.259 ధరకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ మొబైల్ డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్, జియో యాప్స్ (Jio Apps) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. సాధారణంగా ఏ మొబైల్ నెట్వర్క్ ప్లాన్స్ రీఛార్జ్ చేసినా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. కానీ జియో క్యాలెండర్ మంత్ ప్లాన్ ద్వారా అదనంగా వ్యాలిడిటీ అందిస్తోంది. రూ.259 ప్లాన్ రీఛార్జ్ చేస్తే క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఏ తేదీన రీఛార్జ్ చేస్తే తర్వాతి నెలలో ఆ రోజు వరకు వ్యాలిడిటీ లభిస్తుంది. ఉదాహరణకు కస్టమర్ మార్చి 5న రీఛార్జ్ చేసినట్టైతే మళ్లీ ఏప్రిల్ 5న రీఛార్జ్ చేయాలి. ఇలా నెల రోజుల పాటు ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లా పనిచేస్తుంది.

రూ.259 ప్లాన్ రీఛార్జ్ రీఛార్జ్ చేసేవారికి రోజూ 1.5జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. డైలీ కోటా పూర్తైన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కి తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో యాప్‌తో పాటు ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో రీఛార్జ్ చేయొచ్చు. ఇతర జియో ప్లాన్స్ లాగా రూ.259 ప్లాన్‌ను ఎక్కువసార్లు రీఛార్జ్ చేయొచ్చు. ఆ రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ క్యూలో ఉంటాయి. ఒక ప్లాన్ ఎక్స్‌పైరీ కాగానే మరో ప్లాన్ యాక్టీవ్ అవుతుంది. కాబట్టి రీఛార్జ్ చేయాల్సిన తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.

ఇక ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ లవర్స్ కోసం జియో రూ.555 ప్లాన్ రీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్‌తో 55 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ చొప్పున డేటా వాడుకోవచ్చు. దీంతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు రూ.499 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. కానీ వ్యాలిడిటీ 28 రోజులే లభిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. వీటితో పాటు రూ.799, రూ.1,066, రూ.3,119 ప్లాన్స్ రీఛార్జ్ చేసినా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వ్యాలిడిటీ రీఛార్జ్ చేసిన ప్లాన్‌ను బట్టి ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్