Jio, Airtel, BSNL, Vi:ఒక నెల వాలిడిటీతో టెలికాం కంపెనీల బెస్ట్ ప్లాన్స్.. చౌకైన ప్యాక్ ఏంటంటే..

By asianet news telugu  |  First Published Apr 4, 2022, 12:09 PM IST

గత ఐదేళ్లుగా వినియోగదారుల నుండి ఒక నెల వాలిడిటీ పేరుతో డబ్బు వసూలు చేస్తూ 28 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు నెలకు ఒకసారి అంటే సంవత్సరంలో 13 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. 


టెలికాం ఆపరేటర్లు 30 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను జారీ చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ ఏడాది జనవరిలో పేర్కొంది. గత ఐదేళ్లుగా వినియోగదారుల నుండి ఒక నెల వాలిడిటీ పేరుతో డబ్బు వసూలు చేస్తూ 28 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు నెలకు ఒకసారి అంటే సంవత్సరంలో 13 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి చాలా వ్యతిరేకత రావడంతో ఒక నెల వాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించాలని TRAI ఆదేశించింది. TRAI ఆర్డర్ తో మూడు నెలల తర్వాత Jio, Airtel, Vodafone 30 రోజులు ఇంకా 31 రోజులకు ప్రీ-పెయిడ్‌ను ప్రారంభించాయి. జియో, ఎయిర్‌టెల్ , బి‌ఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్ ఐడియా  30 రోజులు ఇంకా 31 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ల గురించి మీకోసం..

జియో ఒక నెల వాలిడిటీ ప్లాన్ 
జియో  ఒక నెల వాలిడిటీ ప్లాన్ ధర రూ. 259. దీనితో మీరు ఒక నెలపాటు పూర్తి వ్యాలిడిటీని పొందుతారు, అంటే మీరు ఏప్రిల్ 1వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే,  నెక్స్ట్ రీఛార్జ్‌ను మే 1వ తేదీన మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు ప్రతిరోజూ 1.5 GB డేటాను పొందుతారు. ఇంకా అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. మీరు ఈ ప్లాన్‌ని  ఎక్కువ సార్లు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి నెల వాలిడిటీ గడువు ముగిసిన తర్వాత కొత్త ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లో కూడా ఇతర ప్లాన్‌ల లాగానే Jio యాప్‌లకు సబ్‌స్క్రైబ్ లభిస్తుంది.

Latest Videos

undefined

ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ ఒక నెల వాలిడిటీతో రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, ఒకటి రూ.296, మరొకటి రూ.319. ఎయిర్‌టెల్ ఈ రెండు కొత్త ప్లాన్‌ల గురించి వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. రూ. 296 ప్లాన్‌లో కస్టమర్‌లు 30 రోజుల వాలిడిటీ పొందుతారు.  ఆంతేకాకుండా ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా మొత్తం 25GB డేటా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్‌లో కస్టమర్‌లు 30 రోజులు కాకుండా మొత్తం నెల  వాలిడిటీ పొందుతారు. అంటే, మీరు మార్చి 1న రీఛార్జ్ చేసుకున్నట్లయితే, మీ ప్లాన్ వాలిడిటీ ఏప్రిల్ 1న ముగుస్తుంది, అనగా నెల అంటే 30 రోజులు లేదా 31 రోజులు.  ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్  చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతిరోజూ 2GB డేటా అందుబాటులో ఉంటుంది. Airtel ఈ రెండు ప్లాన్‌లతో Amazon Prime వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఒక నెల పాటు అందుబాటులో ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా  ఒక నెల వాలిడిటీ  ప్లాన్ 
వోడాఫోన్ ఐడియా VI ఒక నెల వాలిడిటీతో రూ. 327, రూ. 377 రెండు ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 327 ప్లాన్ గురించి మాట్లాడితే, కస్టమర్లు ఇందులో మొత్తం 25 GB డేటాను పొందుతారు.  ఇంకా ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్  చేసుకోవచ్చు. దీని వాలిడిటీ 30 రోజులు. ఇప్పుడు రెండవ ప్లాన్ అంటే రూ. 337 గురించి మాట్లాడితే ఇందులో మొత్తం 28 GB డేటా అందుబాటులో ఉంటుంది, దీని వాలిడిటీ 31 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు, ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.

బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఒక నెల వాలిడిటీ ప్లాన్
బి‌ఎస్‌ఎన్‌ఎల్ (BSNL)లో రూ. 147 ప్లాన్. దీనిలో మొత్తం 10జి‌బి డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో, వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. రెండవ ప్లాన్ రూ. 247, ఇందులో 50 GB డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులు. EROS Now సబ్‌స్క్రిప్షన్ రెండు ప్లాన్‌లతో లభిస్తుంది.

click me!