ఐఫోన్ 14 సిరీస్‌కు సంబంధించి ఈసారి ఆపిల్ ఐఫోన్ 14 మినీని లాంచ్ ఉండదని చెబుతున్నారు. అయితే ఐఫోన్ 14 ధర ఐఫోన్ 14 మినీ ధరకే లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.
అమెరికన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆపిల్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 7న జరగబోతోంది. ఆపిల్ ఈ మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ జరగబోతోంది. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 8 కూడా ప్రారంభించనుంది. ఇంకా ఇతర ఉత్పత్తులను కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ 14 సిరీస్ ధరకు సంబంధించి కొత్త నివేదిక వచ్చింది. ఐఫోన్ 13 ధర కంటే ఐఫోన్ 14 ధర తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఐఫోన్ 14 సిరీస్‌కు సంబంధించి ఈసారి ఆపిల్ ఐఫోన్ 14 మినీని లాంచ్ ఉండదని చెబుతున్నారు. అయితే ఐఫోన్ 14 ధర ఐఫోన్ 14 మినీ ధరకే లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. ఐఫోన్ 14 ధర గురించి మాట్లాడుతూ దాని ధర $750 ఉంటుందని ఒక నివేదిక పేర్కొంది. ఐఫోన్ 14 మ్యాక్స్ ధర $ 850 కావచ్చు, అంటే ఐఫోన్ 13 కంటే $50 ఎక్కువ.
undefined
ఐఫోన్ 14 ప్రో ధర $1,050 , ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర $1,150. ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ రెండూ ఫోన్‌లు బెస్ట్ ఫీచర్లు, ఎక్కువ స్టోరేజ్‌తో అందించనుంది. ఆపిల్ ఏమైనప్పటికీ మోస్ట్ ప్రీమియం యూజర్ల కోసం ప్రో మోడల్‌ను అందిస్తుంది.
ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో అందించవచ్చని నివేదికలు ఉన్నాయి. డిస్‌ప్లే నాణ్యత ఎల్‌టిపిఓతో పాటు అల్వెస్ ఆన్ డిస్‌ప్లేగా ఉంటుంది. ఐఫోన్ 14 సిరీస్‌లోని అన్ని మోడళ్లు ఆపిల్ల్ A16 ప్రాసెసర్‌తో లాంచ్ చేయవచ్చు.
ఐఫోన్ 14 సిరీస్‌కు LPDDR5 ర్యామ్, 8K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో 48-మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుందని మరొక నివేదిక పేర్కొంది. కొత్త ఐఫోన్‌లో అల్ట్రా వైడ్ అప్‌గ్రేడ్ కెమెరా ఉంటుంది.