ఐఫోన్ 13 సిరీస్ విడుదల తేదీ ఖరారు..?

By telugu news teamFirst Published Aug 27, 2021, 3:13 PM IST
Highlights

చైనా సోషల్‌ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్‌ లోనే ఐఫోన్‌ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 13 సిరీస్.. త్వరలోనే ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా ఐఫోన్‌ వినియోగదారులు ఐఫోన్‌ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 13 సిరీస్‌ సెప్టెంబర్‌ 17 న  విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.

చైనా సోషల్‌ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్‌ లోనే ఐఫోన్‌ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌ తో పాటు సెప్టెంబర్‌ 30న ఆపిల్‌ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్‌ లను విడుదల చేయనుంది' అంటూ  కొన్ని స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆ స్క్రీన్‌ షాట్ల ప్రకారం ఐఫోన్‌ 13 సిరీస్‌ తో పాటు ఐఫోన్‌ 13ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్‌ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్‌ తరువాత ఎయిర్‌ పాడ్స్‌3 ని విడుదల చేయనుంది. అధికారికంగా  ఐఫోన్‌ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్‌ మాత్రం సెప్టెంబర్‌ 17న విడుదల చేస్తుందని మార్కెట్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

click me!