సెప్టెంబర్ 10న ‘బయోనిక్ చిప్‌’తో ఐఫోన్ 11 ఫోన్ల ఆవిష్కరణ?!

By rajesh yFirst Published Aug 31, 2019, 10:22 AM IST
Highlights

ఆపిల్ ‘ఐఫోన్’ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రానున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను కూడా పంపినట్లు సమాచారం. 

శాన్‌ఫ్రాన్సిస్కో: ఆపిల్ ‘ఐఫోన్’ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రానున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను కూడా పంపినట్లు సమాచారం. 

ఏటా సెప్టెంబర్ 10వ తేదీన కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల ఆపిల్‌ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అదే రోజున కొత్త మోడళ్లను విడుదల చేస్తూ రావడం ఆపిల్‌ ఆనవాయితీగా మారింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త ఐఫోన్‌ ఆవిష్కరించేందుకు ఆపిల్‌ సన్నాహాలు చేస్తోంది. 

ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌లకు కొనసాగింపుగా ఐఫోన్‌ 11 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేసే అవకాశముంది. మెషిన్‌ లెర్నింగ్‌ సామర్థ్యం కోసం ఐఫోన్‌ 11 సిరీస్‌ను ఏ14 బయోనిక్‌ చిప్‌తో తేనున్నట్లు టెక్‌ వర్గాల సమాచారం. 

కొత్త ఫోన్లకు ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మాక్స్‌గా పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఫోన్లతో పాటు సరికొత్త యాపిల్‌ వాచ్‌ మోడల్‌ను కూడా ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

భారత మార్కెట్లో యాపిల్‌ ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువే. అయితే ఈ మోడళ్లు భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తాయనేది సెప్టెంబరు 10నే వెల్లడించనున్నారు.
 

click me!