జస్ట్ ఇలా చేస్తే మీ పాత ఫోన్ కొత్తదిలా మారుతుంది.. ఈ ట్రిక్ ఎలా చేయాలో తెలుసా..?

By Ashok kumar Sandra  |  First Published Mar 7, 2024, 2:18 PM IST

ఇప్పుడు మీరు మీ పాత  ఫోన్ ని  కొత్తదిల మార్చుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా ఇందుకు ఒక మార్గం   ఉంది . 
 


ఫోన్ కొన్నప్పటి నుంచి దాని స్పీడ్  తగ్గుతోందా... మొదట్లో కొత్త ఫోన్ స్పీడ్ ఉన్నప్పటికీ తర్వాత అంత బాగా పని చేయట్లేదా... అయితే మీరు ఒకసారి మీ ఫోన్  రీసెట్ చేసాక పాత ఫోన్ కొత్తది లాగా ఉంటుందని మీకు తెలుసా...  ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీని కోసం మీరు ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఇంకా మీరు అనవసరమైన యాప్‌లు అండ్  మాల్వేర్‌లను తొలగించవచ్చు. మీ పాత ఫోన్‌ని కొత్తగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ  తెలుసుకోండి... 

స్టెప్  1- సెట్టింగ్‌లకు వెళ్లి సిస్టమ్  సెట్టింగ్ అప్షన్  క్లిక్ చేయండి.

Latest Videos

undefined

స్టెప్  2 - ఇక్కడ మొత్తం క్రిందికి స్క్రోల్ చేసాక   రీసెట్ అప్షన్  చూస్తారు. ఇప్పుడు అక్కడ క్లిక్ చేయండి.

స్టెప్   3 - ఇప్పుడు డిలేట్ అల్ డేటా అప్షన్ పై క్లిక్ చేయండి. కొన్ని డివైజెస్  దీనిని ఫ్యాక్టరీ రీసెట్ అప్షన్ గా చూపిస్తాయి.

స్టెప్  4 - సెక్యూరిటీ  కోసం డివైజ్  పిన్ ఆడుగుతుంది.

స్టెప్  5- ఫోన్ దానంతట అదే  రీసెట్ చేయడాన్ని కొనసాగిస్తుంది. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా మీరు సెట్టింగ్‌లను మార్చలేరని మీరు కనుగొంటే, మీరు రికవరీ మోడ్‌ని ఉపయోగించవచ్చు. ఈ సమయంలో  అనుసరించాల్సిన అనేక విధానాలు ఉన్నాయి.

ముందుగా మీరు మీ ఫోన్‌ను ఆఫ్ చేయాలి. ఇప్పుడు పవర్ అండ్  వాల్యూమ్ డౌన్ బటన్‌లను కలిపి నొక్కి పట్టుకోండి. ఇది ఫోన్‌ను బూట్ చేస్తుంది. స్క్రీన్ ఆన్ అయ్యే వరకు ఈ రెండు బటన్‌లను కలిపి నొక్కి పట్టుకోండి. అప్పుడు భాషను ఎంచుకోండి. చివరగా రికవరీ ఆప్షన్‌లోకి వెళ్లి క్లియర్  డేటా అప్షన్  ఎంచుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ కోడ్ ఎంటర్ చేయాలి. అప్పుడే మీ ఫోన్ ఫార్మాట్ చేయబడుతుంది. ఈ సాధారణ పద్ధతిని అనుసరించడం ద్వారా మీ పాత ఫోన్‌ను కొత్తదిగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతి త్వరగా ఫోన్ సమస్యను తొలగిస్తుంది.

click me!