ఆంధ్ర ప్రదేశ్ లో జియో హవా.. ఏకంగా 3.29 కోట్లమంది ఈ నెట్ వర్క్ వాడుతున్నారా..!

Published : Sep 29, 2026, 11:32 AM IST
Jio

సారాంశం

ప్రస్తుతం ఇండియాలో రిలయన్స్ జియో టాప్ టెలికాం కంపెనీగా కొనసాగుతోంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఈ నెట్ వర్క్ ను ఎంతమంది వాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

Reliance Jio : ఆంధ్రప్రదేశ్ టెలికాం విభాగంలో రిలయన్స్ జియో దూకుడు కొనసాగిస్తోంది. ఈ సంస్థ కనెక్టివిటీ విస్తరణను మరింత వేగవంతం చేసింది. 2026 ఆగస్టు నెలకు సంబంధించి TRAI వినియోగదారుల గణాంకాల ప్రకారం.. మొబైల్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగాల్లో జియోకు గణనీయంగా కొత్త కనెక్షన్లు వచ్చాయి. మొబైల్ సేవల్లో ఒక్క ఆగస్టులోనే 2.12 లక్షల మంది కొత్త కస్టమర్స్ జియో నెట్‌వర్క్‌లో చేరారు. దీంతో ఏపీ సర్కిల్‌లో సంస్థ మొత్తం మొబైల్ కస్టమర్స్ సంఖ్య సుమారు 3.29 కోట్లకు చేరింది. అలాగే గరిష్ఠ VLR (Visitor Location Register) నమోదైన రోజున 96.95 శాతం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ నిష్పత్తి నమోదైంది.

బ్రాడ్‌బ్యాండ్‌లోనూ విస్తరణ

వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో వృద్ధిని కొనసాగించింది. ఆగస్టులో 25,211 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లు చేరడంతో ఏపీ సర్కిల్‌లో మొత్తం కనెక్షన్లు సుమారు 21.55 లక్షలకు పెరిగాయి. సంప్రదాయ కేబుల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కష్టమైన ప్రాంతాల్లో ఎయిర్‌ఫైబర్ వంటి వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా విస్తరణకు దోహదపడుతున్నాయి. 5G FWA (ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్) విభాగంలో 11,058, UBR FWA విభాగంలో 26,513 కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. దీంతో ఈ రెండు విభాగాల్లో కలిపి జియోకు ఏపీ సర్కిల్‌లో 12.64 లక్షలకు పైగా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి.

జాతీయ స్థాయిలోనూ జియో వృద్ధి

దేశవ్యాప్తంగా కూడా ఆగస్టులో జియో బ్రాడ్‌బ్యాండ్, FWA విభాగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల చేరికలో సమీప పోటీదారుతో పోలిస్తే సుమారు 2.5 రెట్లు అధిక వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఆగస్టులో జియో సుమారు 4 లక్షల FWA కనెక్షన్లు జోడించగా, జాతీయ FWA మార్కెట్‌లో సంస్థ వాటా సుమారు 78.6 శాతంగా ఉంది. మొబైల్, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో ఏకకాలంలో కస్టమర్స్ ని పెంచుకోవడం ద్వారా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా జియో తన కనెక్టివిటీ విస్తరణను కొనసాగిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

JioShield : నెలకు కేవలం రూ.83 చాలు.. మీ పిల్లలు ఫోన్ కు బానిస కాకుండా కాపాడే సూపర్ యాప్ మీసొంతం
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు