24న హువావే హై ఎండ్ ‘5జీ’ స్మార్ట్ ఫోన్

By narsimha lodeFirst Published Feb 3, 2019, 10:56 AM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ ‘5జీ’ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఈ నెలాఖరులో రానున్నది. 


న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ ‘5జీ’ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఈ నెలాఖరులో రానున్నది. ఈ నెల 24న బార్సిలోనాలో జరిగే ఎండబ్ల్యూసీ వేడుకలో ఈ ఫోన్ ఆవిష్కరించనున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఈ మేరకు బయటకు లైట్ వెలువరించే‘వీ’ షేప్‌లో ఫోన్ ఇమేజ్‌ను కూడా అప్‌లోడ్ చేసింది. 

5జీ సపోర్టుతో హువావే రూపొందించిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ప్రెట్టీగా ఉంటుంది. హువావే ఫోల్డబుల్ ఫోన్.. దాని దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ గేలాక్సీ ఫోల్డ్ కంటే పెద్ద మిస్టరీగా మారింది. కొద్ది నెలల క్రితమే పాక్షిక ద్రుశ్యాలను శామ్‌సంగ్ మార్కెట్లోకి లీక్ చేసింది. హువావే ఫోల్డబుల్ ఫోన్ చూడడానికి టాబ్లెట్ మాదిరిగా ప్రెట్టీ లార్జ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 

శామ్‌సంగ్ గేలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ కంటే హువావే 5జీ ఫోల్డబుల్ ఫోన్ పెద్దదిగానే ఉండే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. శామ్‌సంగ్ గేలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ లార్జ్ డిస్ ప్లే లోపలికి ఫోల్డ్ చేసేందుకు వీలుగా డిజైన్ చేశారు. కానీ రోయొల్ ఫ్లెక్స్‌పాయి మాదిరిగా హువావే ‘5జీ’ స్మార్ట్ ఫోన్ బయటకు కూడా ఫోల్డ్ చేయొచ్చు.

దీన్నిబట్టి హువావే ఫోల్డబుల్ డిస్ ప్లే పెద్దగా ఉంటుంది. శామ్‌సంగ్ గేలాక్సీ ఫోల్డ్ రెండు డిస్ ప్లేలు కలిగి ఉంటుంది. ఒక డిస్ ప్లే ఏడంగుళాలు ఉంటే, మరొకటి చిన్నగా బయటకు నాలుగు అంగుళాలు మాత్రమే ఉంటుంది. 
అంతేకాదు హువావే ఫోల్డబుల్ ‘5జీ’ ఫోల్డబుల్ ఫోన్.. బాలాంగ్ 5000 చిప్ సెట్, ఫస్ట్ కమర్షియల్ 5జీ రూటర్ కలిగి ఉంటుంది. ఇంకా హువావే ఫోల్డబుల్ ఫోన్‌లో అసెంబ్లింగ్ చేసిన ఇతర హార్డ్ వేర్ల వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు డ్యూయల్ ఎన్‌పీయూతోపాటు లేటెస్ట్ కిరిన్ 980 చిప్ సెట్ కూడా పొందొచ్చు. 

click me!