ట్రంప్ ఆంక్షల మధ్య 19న హువావే ‘మ్యాట్’ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ

By rajesh yFirst Published Sep 3, 2019, 10:27 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల మధ్య ఈ నెల 19వ తేదీన హువావే తన తాజా ఫోన్ ‘పీ30 ప్రో’ను జర్మనీలోని మ్యూనిచ్‌లో విపణిలోకి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే తన తదుపరి ఫ్లాగ్ షిప్ ‘మ్యాట్ 30’ సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ తేదీని ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన జర్మనీలోని మ్యూనిచ్‌లో విపణిలోకి విడుదల చేస్తామని ఆదివారం ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.

‘రీ థింక్ పాసిబిలిటీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సిరీస్ ఫోన్లు విపణిలోకి అడుగిడతాయి. హువావే తన వెబ్‌సైట్ ద్వారా ‘మ్యాట్ 30’ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. పూర్తిగా సర్క్యులర్ సెటప్‌తో కూడిన కెమెరాలను కలిగి ఉంటుందీ ఫోన్. మ్యాట్ 30 ప్రో సిరీస్ ఫోన్ 6.7 అంగుళాల అమోల్డ్ ‘వాటర్ ఫాల్’ డిస్ ప్లే విత్ 90 హెచ్‌జడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

బ్యాక్ 40 ఎంపీ సెన్సర్లతోపాటు ట్రిపుల్ స్పోర్ట్ కెమెరాలు ఉంటాయి. 4200 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంతోపాటు 55 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్, ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ (ఓఎస్) కలిగి ఉంటుంది. అమెరికా నిషేధం మధ్య హువావే తన కొత్త ‘మ్యాట్ 30’ సిరీస్ ఫోన్లను విపణిలోకి ఆవిష్కరించనుండటం గమనార్హం. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలు అమలులో ఉండటం వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్, ఖ్వాల్ కాలం తదితర టెక్ దిగ్గజ సంస్థలు హువావేతో కలిసి పని చేయవు. గూగుల్ యాప్స్ లేకుండానే హువావే ఫోన్ ఆవిష్కరణలోకి రానుండటం మరో ఆసక్తికర పరిణామం. గూగుల్ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా హువావే సొంతంగా అభివ్రుద్ది చేసి రూపొందించిన హార్మోనీ ఓఎస్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

click me!