MateBook Fold: హువావే సంచలనం.. మార్కెట్ లోకి 18 inch ఫోల్డబుల్ ల్యాప్‌టాప్

Published : Jun 08, 2025, 06:19 PM IST
Huawei MateBook Fold Ultimate

సారాంశం

Huawei MateBook Fold: హువావే తొలి 18-అంగుళాల మేట్‌బుక్ ఫోల్డ్ ల్యాప్‌టాప్ విడుదలైంది. ఇది HarmonyOS 5, 3.3K LTPO OLED డిస్‌ప్లే, 140W ఛార్జింగ్‌తో వస్తోంది.

Huawei MateBook Fold: చైనా టెక్ దిగ్గజం హువావే తన తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. MateBook Fold Ultimate Design పేరుతో పరిచయమైన ఈ ల్యాప్‌టాప్ తో హువావే ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ విభాగానికి ప్రవేశించడమే కాకుండా, HarmonyOS for PCని కూడా ఆవిష్కరించింది.

హువావే ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ ఫీచర్స్

ఈ ల్యాప్‌టాప్ 18 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉండగా, 4:3 రేషియోలో 3.3K రిజల్యూషన్‌ను అందిస్తుంది. దీనిని మడిచి 13 అంగుళాల సైజులో కూడా వాడుకోవచ్చు. LTPO OLED డ్యూయల్ లేయర్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్క్రీన్‌ 2,000,000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియోతో పాటు గరిష్టంగా 1,600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది 1.16 కిలోగ్రాములు బరువు ఉంటుంది. దీనిని పూర్తిగా విప్పినప్పుడు 7.3 మిల్లీమీటర్లు మందం మాత్రమే ఉండటం దీని మరో ప్రత్యేకత.

మేట్‌బుక్ ఫోల్డ్ ల్యాప్‌టాప్ ఇండస్ట్రీలో సంచలనం

హువావే ప్రకారం, ఈ ల్యాప్‌టాప్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద 285 మిల్లీమీటర్ల ఫోల్డబుల్ హింజ్‌ను కలిగి ఉంది. యూనిఫామ్ టార్క్‌తో కూడిన మూడు-దశల షాఫ్ట్ దీర్ఘకాలిక ఉపయోగానికి అనువుగా ఉంటుంది. ఇది 0 డిగ్రీల నుండి 150 డిగ్రీల వరకూ వివిధ యాంగిల్స్‌లో మడవదగినట్లు డిజైన్ చేశారు. డైమండ్ అల్యూమినియం డ్యూయల్-ఫ్యాన్ సెటప్, అల్ట్రా-థిన్ యాంటీ-గ్రావిటీ వెపర్ చాంబర్ వంటి ఫీచర్లతో శక్తివంతమైన కూలింగ్‌ను అందిస్తుంది.

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ల్యాప్‌టాప్ సాఫ్ట్‌వేర్, చిప్ టెక్నాలజీ వివరాలు

ఈ ల్యాప్‌టాప్ HarmonyOS 5 ద్వారా పనిచేస్తుంది. ఇది మొబైల్, డెస్క్‌టాప్ అనుభవాలను ఏకీకృతంగా అనుసంధానించే లక్షణం "One System, Unified Ecology"ని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌లో హువావే తయారు చేసిన ఇంటర్నల్ చిప్ ఉపయోగించారు. అయితే, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. కానీ, లెటెస్ట్ చిప్ టెక్నాలజీలో సంచలనం కానుందని టాక్ నడుస్తోంది.

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ల్యాప్‌టాప్ అదనపు ఫీచర్లు

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ల్యాప్‌టాప్ లో 8MP వెబ్‌క్యామ్, ఫింగర్‌ప్రింట్ పవర్ బటన్, Wi-Fi 6E, Bluetooth 5.2, రెండు టైప్-C పోర్ట్స్, ఆరు స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్‌లు, 74.69Wh బ్యాటరీ, వేగవంతమైన 140W ఛార్జింగ్‌ను కలిగి ఉంది.

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ల్యాప్‌టాప్ ధర ఎంత?

MateBook Fold Ultimate Design మూడు వేరియంట్ రంగుల్లో విడుదలైంది. వాటిలో Forged Shadow Black, Sky White, Cloud Blue లు ఉన్నాయి. బ్లాక్ వేరియంట్‌లో "Forging Shadow Cloud Pattern" డిజైన్, "Black Gold Waistline" ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

• 32GB RAM / 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 23,999 (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2.84 లక్షలు)

• 32GB RAM / 2TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 26,999 (సుమారు రూ. 3.2 లక్షలు)

ఈ ల్యాప్‌టాప్ కోసం చైనా లో రిజర్వేషన్లు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్