మ్యాథ్స్ చేయడంలో సమస్యగా ఉందా ? ఇలా ఫాస్ట్ అండ్ సింపుల్ గా సాల్వ్ చేయవచ్చు..

By Ashok kumar SandraFirst Published Mar 14, 2024, 3:24 PM IST
Highlights

ఈ యాప్స్  మ్యాథ్స్  లో నిష్ణాతులైన తల్లిదండ్రులకు వారి  పిల్లలు మ్యాథ్స్   క్వశన్స్ కి సరిగ్గా చేశారో లేదో చెక్ చేయడానికి కూడా సహాయపడతాయి. 

మ్యాథ్స్  చేయడానికి మీ ఫోన్‌లో కాలిక్యులేటర్‌  తెరవడానికి ఇకపై పరుగెత్తాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా ఫోన్  కెమెరాను ఉపయోగించి చేయడం  ఎలా..? ఆన్సర్  కోసం  మాథ్స్   క్వశ్చన్ పై ఫోన్ కెమెరా పెడితే చాలు. ఈ క్వశ్చన్ చేతితో రాసిందైనా  లేదా ప్రింటెడ్ అయినా . దింతో ఇప్పుడు  Microsoft Math Solver (Math Solver) అండ్ Google Photomath (Photomath) వంటి యాప్‌లలోని AI పని చేయడం ప్రారంభిస్తుంది. మీరు సెకన్లలో సమాధానం పొందుతారు. ఈ సమాధానాన్ని పొందే మార్గాలు కూడా వివరంగా ఇవ్వబడతాయి. అంతేకాదు Math Solver అండ్  Photomath  విద్యార్థులకు మ్యాథ్స్ ఈజీ చేసే యాప్‌లుగా మారాయి. మ్యాథ్స్   క్వశ్చన్ కు  సమాధానాన్ని ఎలా ప్రూవ్ చేయాలో  వివరంగా మీకు చూపడం దీని  ప్రత్యేకత. 

ఈ యాప్స్  మ్యాథ్స్  లో నిష్ణాతులైన తల్లిదండ్రులకు వారి  పిల్లలు మ్యాథ్స్   క్వశన్స్ కి సరిగ్గా చేశారో లేదో చెక్ చేయడానికి కూడా సహాయపడతాయి. ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ ఇంకా  యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ యాప్‌కి ప్లే స్టోర్‌లో మ్యాథ్స్ సాల్వర్ అని పేరు పెట్టగా, యాప్ స్టోర్‌లో మ్యాథ్స్ సోల్వర్-హెచ్‌డబ్ల్యూ అని పేరు పెట్టారు. ఈ  రెండు యాప్స్ ఇంకా ఉచితం.

గూగుల్‌లో ఫోటోమ్యాత్ ప్లస్ అనే యాప్ వెర్షన్ కూడా ఉంది. దీనికి షబ్ స్క్రిప్షన్ ఫోజు  రూ.449 అండ్ రూ.849. ఈ వెర్షన్ పాఠ్యపుస్తక బొమ్మలు అలాగే యానిమేటెడ్ ట్యుటోరియల్‌లతో వస్తుంది. ఉచిత వెర్షన్ కంటే మరింత వివరంగా ఈ యాప్ పిల్లలకు మాథ్స్  అందించబడుతుంది. మీరు యాప్ స్టోర్ ఇంకా  ప్లే స్టోర్‌లో సెర్చ్ చేయడం ద్వారా వాటిని త్వరగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.  ఆపై యాప్‌లోని సూచనలను అనుసరించండి అండ్  కొనసాగండి.

click me!