Paytm layoffs : టీం సైజ్ 20% కట్.. పర్ఫార్మెన్స్ రివ్యూ రొటీన్ : కంపెనీ

By Ashok kumar SandraFirst Published Mar 14, 2024, 1:00 PM IST
Highlights

 కంపెనీ AIని స్వీకరించిన తర్వాత డిసెంబర్ 2023లో ఇచ్చిన 1,000 పింక్ స్లిప్‌ల కంటే ఈసారి తొలగించిన  వ్యక్తుల సంఖ్య చాలా పెద్దదని ఊహాగానాలు ఉన్నాయి అని మరొక ఉద్యోగి తెలిపారు. 

PayTM మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దింతో కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించవచ్చు. Paytm పేమెంట్స్ బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పరిశీలనను ఎదుర్కొంటున్న సమయంలో ఈ చర్య వచ్చింది.

ఎంత మంది సిబ్బంది కంపెనీ నుండి వెళ్లిపోతారనేది ఇంకా వెల్లడించనప్పటికీ, గత రెండు వారాల్లో టీం  సైజ్ 20 శాతం వరకు తగ్గించాలని కొన్ని విభాగాలను కోరినట్లు సమాచారం. 

గత కొన్ని నెలలుగా, Paytm వివిధ దశల్లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు, ఈ ఏడాది టెక్ సంస్థ చేసిన అతిపెద్ద తొలగింపుల్లో ఇది ఒకటి. Paytm  వైఖరి వ్యాపారాలను క్రమబద్ధీకరించడానికి ఇంకా  ఖర్చులను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో భాగంగా ఈ తొలగింపులు ఉండనున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీ వెళ్లడం వల్ల మరిన్ని ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని Paytm ప్రతినిధి ఒకరు తెలిపారు. 

చిన్న వినియోగదారుల రుణాలపై రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించడం Paytmకి పెద్ద ఎదురుదెబ్బ పడింది. Paytm   ప్రధాన ఆదాయ వనరు రూ.50,000 లోపు రుణాలు. నియంత్రణ తర్వాత డిసెంబర్ 7న కంపెనీ షేరు ధర దాదాపు 20 శాతం పడిపోయింది.

Paytm కాకుండా, ఫిజిక్స్‌వాలా, ఉడాన్, థర్డ్ వేవ్ కాఫీ ఇంకా బిజోంగో వంటి టెక్ స్టార్టప్‌లు కూడా ఈ సంవత్సరం గణనీయమైన తొలగింపులను చవిచూశాయి. ఫిన్‌టెక్ స్టార్టప్ జెస్ట్‌మనీ తీవ్ర సంక్షోభం కారణంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

 కంపెనీ AIని స్వీకరించిన తర్వాత డిసెంబర్ 2023లో ఇచ్చిన 1,000 పింక్ స్లిప్‌ల కంటే ఈసారి తొలగించిన  వ్యక్తుల సంఖ్య చాలా పెద్దదని ఊహాగానాలు ఉన్నాయి అని మరొక ఉద్యోగి తెలిపారు. 

click me!