ఫేస్‌బుక్ రాకకు ముందు ఎక్కడెక్కడి వారినో కలిపిన గూగుల్ ప్లస్ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది..
ఫేస్‌బుక్ రాకకు ముందు ఎక్కడెక్కడి వారినో కలిపిన గూగుల్ ప్లస్ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది.. సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 5 లక్షల మంది యూజర్ల డేటా చోరీ అయినట్లుగా గూగుల్ ప్లస్‌పై ఆరోపణలు ఉన్నాయి.
2015 నుంచి 2018 మార్చి మధ్యకాలంలో ఈ సమాచారం లీక్ అయినట్లుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలల పాటు వినియోగదారులు గూగుల్ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది.
undefined
ప్రాజెక్ట్ స్ట్రోబ్ కింద గూగుల్ చేపట్టిన సెర్చ్‌లో టెక్నికల్ బగ్‌ను నిపుణులు గుర్తించారు.. మార్చి నెలలో ఆ సాఫ్ట్‌వేర్ బగ్‌కు విరుగుడు కనుగొన్నారు. కానీ ఆ లోపు 5 లక్షల అకౌంట్ల సమాచారం బయటకు వెళ్లిపోయింది.
వినియోగదారుల నుంచి ఆదరణ తగ్గిపోతుండటం... భద్రతాపరమైన లోపాల కారణంగా గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లుగా గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఏళ్లుగా గూగుల్ ప్లస్‌ను వినియోగిస్తున్న వారు షాక్‌కు గురయ్యారు.