ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900. ఈ ధర వద్ద 128జిబి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది, అయితే మొదటిసారి ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌ను ఆఫర్‌తో లిస్ట్ చేసింది. ఐఫోన్ 14 మోడల్స్ పై ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి.
ఈ సంవత్సరంలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ కింద కొత్త ఐఫోన్‌లను ఇండియాలో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. కొత్త సిరీస్ లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900. ఈ ధర వద్ద 128జిబి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది, అయితే మొదటిసారి ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌ను ఆఫర్‌తో లిస్ట్ చేసింది. ఐఫోన్ 14 మోడల్స్ పై ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. iPhone 14తో లభించే డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను చూద్దాం...
ఐఫోన్ 14
ఐఫోన్ 14 128జిబి, 256 జిబి, 512జిబి మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్‌లు ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ను రూ. 2,000 తగ్గింపుతో రూ.77,900 వద్ద లిస్ట్ చేయబడింది. ఇది మాత్రమే కాదు, ఫోన్‌తో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 5 వేల తగ్గింపు కూడా అందిస్తుంది.
రెండు ఆఫర్లతో ఐఫోన్ 128జిబిని రూ.72,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.89,900 ధర ఉన్న 256 జీబీ మోడల్‌ను రూ.82,900కి, 512 జీబీ మోడల్‌ను రూ.1,02,900కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 కొనుగోలుపై Amazon Indiaలో రూ. 16,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంటే పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అన్ని ఆఫర్‌లతో iPhone 14ని రూ. 20,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ఫీచర్స్
ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది, ఇది (1170x2532 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 460 పిపిఐతో వస్తుంది. డిస్‌ప్లేతో 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేకి సపోర్ట్ అందించారు. ఐఫోన్ 14లో A15 బయోనిక్ ప్రాసెసర్ ఇచ్చారు, ఇది 5 కోర్ GPUతో వస్తుంది. ఐఫోన్ 14 12-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇ-సిమ్ ఇంకా శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ కూడా ఐఫోన్‌తో లభిస్తుంది.