మీరు ఫోన్లో ఈ బ్రౌసర్ వాడుతున్నారా జాగ్రత్త; కేంద్రం కీలక వార్నింగ్..

By Ashok kumar SandraFirst Published Mar 23, 2024, 5:45 PM IST
Highlights

మొజిల్లా (Mozilla) ఫైర్ ఫాక్స్   ప్రొడక్ట్స్  యూజర్లు  వీలైనంత త్వరగా వాటిని అప్‌డేట్ చేయాలని Cert-In సిఫార్సు చేస్తోంది. 
 

మొజిల్లా ఫైర్ ఫాక్స్ పై కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. సెంట్రల్ ఏజెన్సీ సెర్ట్-ఇన్ ఫైర్‌ఫాక్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తలెత్తే కొన్ని సెక్యూరిటీ  ముప్పును  ఎత్తి చూపింది. అయితే మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌసర్  అప్‌డేట్ చేయడం ద్వారా ఈ ముప్పును అధిగమించవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది.కంప్యూటర్ సెక్యూరిటీ సిస్టమ్‌లను దాటవేయడానికి ఫైర్‌ఫాక్స్‌లోని సమస్యలను హ్యాకర్లు  ఉపయోగించుకోవచ్చని అండ్  తద్వారా ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేయవచ్చని హెచ్చరిక చెబుతోంది. 

సెక్యూరిటీ  సమస్య ప్రస్తుతం Firefox ESR 115.9కి ముందు వెర్షన్‌లు, Firefox iOS 124కి ముందు వెర్షన్‌లు అండ్  Mozilla Thunderbird 115.9కి ముందు వెర్షన్‌లలో కనుగొనబడింది. 

Mozilla ప్రొడక్ట్స్ యూజర్లు  వీలైనంత త్వరగా వాటిని అప్‌డేట్ చేయాలని Cert-In సిఫార్సు చేస్తోంది. అలాగే కంపెనీ ప్రొడక్ట్స్  సంబంధించిన తాజా అప్‌డేట్‌లను విడుదల చేసింది. థర్డ్-పార్టీ సోర్స్‌ల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దని అలాగే తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని సెర్ట్-ఇన్ సలహా ఇస్తుంది. 

నవంబర్ 2023లో, Cert-IN ఇదే సమస్య గురించి హెచ్చరించింది. హెచ్చరిక ఏమిటంటే, ఫైర్‌ఫాక్స్ వినియోగదారులను వారి డివైజ్  హ్యాక్ చేయడానికి సహాపడే మల్టి సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. అండ్ Mozilla  ప్రొడక్ట్స్  అప్ డేట్ చేయడానికి ప్రాంప్ట్ చేసింది. 115.50.0కి ముందు ఉన్న Firefox ESR వెర్షన్‌లు, 120కి ముందు Firefox iOS వెర్షన్‌లు అలాగే  115.5కి ముందు Mozilla Thunderbird వెర్షన్‌లలో ఈ సమస్య గుర్తించబడింది. Firefox యాప్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్‌లు యాక్టివేట్ అయ్యాయని అండ్  మెసేజ్‌లు ఇంకా ఇమెయిల్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని కూడా ఏజెన్సీ వినియోగదారులను కోరింది. 

click me!