ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ ! కారణం ఇదే...

By Ashok kumar Sandra  |  First Published Mar 21, 2024, 4:59 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరాయంపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. లక్షలాది మంది యూజర్లు  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లను ఉపయోగించలేకపోతున్నట్లు  వాపోతున్నారు.
 


ఒక్క నెలలో మూడోసారి మెటాకు చెందిన ఫేస్‌బుక్, మెసెంజర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయాయి. చాలా మంది యూజర్లు  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు  ఫిర్యాదు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్ డౌన్ కావడం పై వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. లక్షలాది మంది వినియోగదారులు ఇప్పటికే  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లను ఉపయోగించలేకపోతున్నామని చెప్పారు.

Latest Videos

దాదాపు 8 PM IST నుండి వారు ఈ ఊహించని అంతరాయం ఎదుర్కొంటున్నారని వినియోగదారుల ఫిర్యాదుల నుండి తెలిసింది. బ్రిటన్, US ఇంకా అనేక యూరోపియన్ దేశాల్లోని వినియోగదారులు ఇలాంటి ఫిర్యాదులను నివేదించారు. ఆసియాలోని చాలా ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి.

సోషల్ మీడియా అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ నివేదించిన డేటా ప్రకారం, దాదాపు 60% మంది వినియోగదారులు Facebook, Messenger అండ్  Instagram అప్లికేషన్‌లలోకి లాగిన్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, మెసెంజర్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు  26% మంది చెప్పారు.

కొంతమంది వినియోగదారులు ఈ సైట్‌లలో ఫీచర్స్  ఉపయోగించడంలో ఇబ్బందిని  ఎదురుకొంటున్నట్లు నివేదించారు. ఇంకా  లాగిన్ సెషన్ టైం ముగిసినట్లు పాప్-అప్ మెసేజ్ కనిపించిందని చాలా మంది నివేదించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ కాలేకపోతున్నామని చెబుతున్నారు.

ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే చాలా మంది వినియోగదారులు ట్విట్టర్, వాట్సాప్ అలాగే  ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యను గురించి ఫిర్యాదు చేసారు. అయితే దీనిపై ఇంకా కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

చాలా మందికి   ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్స్,  లాగిన్ చేయడం లేదా రిఫ్రెష్ చేయడం సాధ్యం కాలేదు, మరికొంత మందికి   పాస్‌వర్డ్‌ రీసెట్ చేయమని   ప్రాంప్ట్  చూపింస్తుందని వెల్లడించారు. 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా మెటా సర్వీసెస్ క్రాష్‌  అండ్ లాగిన్ సమస్యలను నివేదిస్తూ భారతదేశం ఇంకా  ఇతర  దేశాలలోని    వినియోగదారులు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో   ఆందోళనలను వ్యక్తం చేశారు. 

మెటా ప్రతినిధి ఈ అంతరాయాన్ని ధృవీకరించారు అలాగే   వినియోగదారులందరికీ సమస్య పరిష్కరించబడిందని పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనప్పటికి  ప్రస్తుత సాంకేతిక సమస్యపై ఎలాంటి వివరాలు అందలేదు. వాట్సాప్ తో పాటు  థ్రెడ్‌ సర్వీసెస్ అంతరాయం చాలా తక్కువగా ఉంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, కొంతమంది మెటా ఉద్యోగులు  మెసేజింగ్ యాప్  పై ఆందోళన వ్యక్తం చేశారు, వారు ఇంటర్నల్ వర్క్ సిస్టంలకు  యాక్సెస్ చేయలేకపోతున్నారని పేర్కొంది, దింతో తొలగింపుల గురించి ఊహాగానాలకు దారితీసింది. మరోవైపు మెటా ప్లాట్ ఫార్మ్స్  పై  సోషల్ మీడియా Xలో మీమ్స్  చక్కర్లు కొడుతున్నాయి . 

Facebook అండ్  Instagram హ్యాక్ అయ్యాయా?
 ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యాయా ? లేదు ఆలా కనిపించడం లేదు, కానీ ఈ  రెండు సేవలు అంతరాయం కలిగిస్తున్నాయి. ఫేస్‌బుక్ డౌన్ కావడం  గతంలో కూడా  జరిగింది, అయితే దీనికి  చాలా కారణాలు ఉండొచ్చు అని ESET   గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ మూర్ అన్నారు. అయితే ఇది "సైబర్-దాడి కావడం చాలా అసంభవం, కానీ  దీనిని పూర్తిగా తోసిపుచ్చలేము" అని కూడా  చెప్పారు.

ఫేస్‌బుక్ పేరెంట్ మెటా X (గతంలో ట్విట్టర్) ద్వారా సమస్యను కన్ఫర్మ్ చేసింది, సంస్థ "ఇప్పుడు దీనిపై పని చేస్తోంది" అని కూడా తెలిపింది.

మెటా ప్రతినిధి ఒక ఇమెయిల్ ద్వారా సాంకేతిక సమస్య కారణంగా ప్రజలు మా సేవలలో కొన్నింటిని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. మేము   వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాము. ఏదైనా అసౌకర్యానికి  క్షమాపణలు కోరుతున్నాము అని పేర్కొన్నారు. 

Facebook అండ్ Instagram డౌన్ పై  రియాక్షన్
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడంతో, చాలా మంది యూజర్లు   Xలో  పోస్ట్స్ చేసారు.  సోషల్ మీడియా సైట్ అధినేత  ఎలోన్ మస్క్ నుండి స్ట్రాంగ్ పోస్ట్‌కు దారితీసింది. "మీరు ఈ పోస్ట్ చదువుతున్నారంటే, మా సర్వర్లు పని చేస్తున్నయని." అంటూ ట్వీట్ చేసారు. మరికొందరైతే మమ్మల్ని హ్యాక్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 

మెటా అంతరాయం పై నిపుణుల విశ్లేషన 
సాఫ్ట్‌వేర్ దిగ్గజం సిస్కో  థౌజండ్ ఐస్ ఇంటర్నెట్ ఇంటెలిజెన్స్ బృందం నిపుణులు మెటా అంతరాయాన్ని విశ్లేషించారు, వాస్తవానికి ఏమి జరిగిందనే దాని గురించి ప్రజలకు మరింత వివరంగా సమాచారాన్ని అందించారు.

గ్లోబల్ ఇంటర్నెట్‌లో వేలాది సేవలు,  నెట్‌వర్క్‌ల రీచ్‌బిలిటీ ఇంకా పర్ఫార్మెన్స్  యాక్టీవ్ గా  పర్యవేక్షిస్తున్న థౌజండ్ ఐస్ టీం  ప్రకారం-మెటా అంతరాయానికి బహుశా అతేంటికేషన్  వంటి బ్యాకెండ్ సేవలో సమస్య ఏర్పడి ఉండవచ్చు.

"నెట్‌వర్క్ మార్గాలు క్లియర్ గా,  వెబ్ సర్వర్‌లు వినియోగదారులకు ప్రతిస్పందించడం  మెటా  వెబ్ సర్వర్‌లు అందుబాటులో ఉన్నాయని థౌజండ్ ఐస్ నిర్ధారిస్తుంది" అని పరిశోధకులు ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు.  

సుమారు 16:50 UTC (8:50am PST) నాటికి, థౌజండ్ ఐస్ మెటా సేవలు క్రమంగా పునరుద్ధరించబడతాయని గమనించింది, చాలా మంది వినియోగదారులు అప్లికేషన్‌ను సక్సెస్ ఫుల్ గా  యాక్సెస్ చేయగలరు. 18:40 UTC (10:40 am PST) నాటికి సమస్య పరిష్కరించబడినట్లు కనిపించిందని పరిశోధకులు తెలిపారు.

 మార్చి 6న కొంతమంది వినియోగదారులు వారి  అకౌంట్స్ ఇప్పటికీ యాక్సెస్ చేయలేకపోతున్నామని వెల్లడించారు, ఫేస్‌బుక్‌తో ఇంకా  సమస్యలు ఉండవచ్చని సూచిస్తున్నారు. సైట్‌లో SMS కోడ్‌లు పని చేయని కారణంగా టు-ఫాక్టర్  అతేంటికేషన్  (2FA) సమస్య కారణంగా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి.  

Facebook అండ్ Instagram సెక్యూరిటీ 
మీరు Facebook అండ్ Instagram   ఓపెన్ చేసినపుడు, మీరు తిరిగి లాగిన్ అవ్వవలసి ఉంటుంది. మీరు ఇలా చేసినప్పుడు, మీ అకౌంట్ సెక్యూరిటీ  పెంచుకోవడం ఇంకా 1Password లేదా Bitwarden వంటి పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించడం  మంచిది . "ఫేస్‌బుక్ బ్యాకప్ అండ్ రన్ అవుతున్నప్పుడు, వినియోగదారులు తిరిగి లాగిన్ అయ్యే ఛాన్స్  ఇవ్వబడుతుంది, అయితే ఫర్  
 గెట్ పాస్‌వర్డ్‌ను నొక్కితే  పాస్‌వర్డ్ మేనేజర్ ద్వారా కొత్త ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను రూపొందించవచ్చు" అని మూర్ చెప్పారు.

హ్యాకర్ల నుండి మీ Facebook ఇంకా Instagramని రక్షించడానికి అదనపు సెక్యూరిటీ  కోసం మీరు టు-ఫాక్టర్ అతేంటీకేషన్  కూడా ప్రారంభించవచ్చు.

click me!