క్షణాల్లో పేలిన వాషింగ్ మెషీన్: ఓ వ్యక్తి జస్ట్ మిస్.. సీసీ కెమెరాకు చిక్కిన ప్రమాదం..

By asianet news telugu  |  First Published Apr 5, 2023, 1:15 PM IST

పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఇతర విద్యుత్ మెషిన్స్ కూడా దగ్ధమయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన జరిగింది, పేలుడు శబ్దం వినడంతో అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు. 


సెల్‌ఫోన్‌ పేలుళ్లు, చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పేలుళ్లు ఇలా పలు ఘటనలు ఇప్పటికే చోటుచేసుకున్నాయి.. ఇంకా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పేలుతున్న ఈ ఎలక్ట్రికల్ వస్తువుల లిస్ట్ లోకి ఇప్పుడు వాషింగ్ మిషన్ కొత్తగా చేరింది. అవును, స్పెయిన్‌లో ఒక వాషింగ్ మెషీన్ అకస్మాత్తుగా పేలింది అయితే అది పేలడానికి క్షణాల ముందు దాని ముందు నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాడు, తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన అక్కడి సీసీ కెమెరాలో చిక్కి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. 

ఓన్లీ బ్యాంగర్స్ (@OnlyBangersEth) ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా 16 సెకన్ల నిడివి గల వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసే ముందు జేబులు సరిగ్గా చెక్ చేసుకోలేదని ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ఈ వీడియోకి 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో చూసినట్లుగా, ఒక వ్యక్తి ఒక భుజంపై బ్యాగ్‌ను, చేతుల్లో మూడు బ్యాగ్‌లతో బిల్డింగ్ నుండి బయటకు వెళ్లాడు. 

Latest Videos

undefined

పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఇతర విద్యుత్ మెషిన్స్ కూడా దగ్ధమయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన జరిగింది, పేలుడు శబ్దం వినడంతో అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేసి అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి పిలిచినట్లు స్థానిక వెబ్‌సైట్ నివేదించింది. ఈ వాషింగ్ మెషీన్ లోపల బట్టలు ఉతకడానికి వేసే వారు దుస్తుల పాకెట్స్ సరిగ్గా సరిచూసుకోక పోవడంతో బట్టల జేబులో లైటర్ లేదా ఏదైనా ఎలెక్ట్రోనిక్ వాషింగ్ మెషీన్ లో ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక వెబ్ సైట్ పేర్కొంది. 

ఘటనానంతరం అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదం జరిగిన భవనం గోడను కూల్చివేశారని, భద్రత ప్రమాదం ఉందని మొత్తం భవనాన్ని పునర్నిర్మించాలని ఆదేశించినట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం స్కాట్‌లాండ్‌లో వాషింగ్ మెషీన్ పేలి ఇంటి వంటగది పూర్తిగా ధ్వంసమైన సంఘటన తెలిసిందే. 

 

Someone didn't check their pockets pic.twitter.com/MjpK5mPba7

— OnlyBangers (@OnlyBangersEth)
click me!