చీపురు మీద కొలెస్ట్రాల్ చార్ట్.. బరువు తగ్గడానికి సరిగ్గా ఊడిస్తే సరిపోతుందా?

By asianet news teluguFirst Published Aug 8, 2023, 11:08 PM IST
Highlights

ప్రజలను ఆకర్షించేందుకు కంపెనీలు రకరకాల కసరత్తులు చేస్తుంటాయి. ఈ రోజుల్లో అనేక ఉత్పత్తులను ఇమ్యూనిటీ బూస్టర్ అని లేబుల్ చేస్తున్నాయి. ఇప్పుడు చీపురు వంతు వచ్చింది. ఇక్కడ  ఏముందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు... 
 

మనం కొన్ని వస్తువులను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము. ఆహార పదార్థాలు లేదా శుభ్రపరిచే వస్తువులు ఏదైనా ఉండవచ్చు. ఇంటి చుట్టుపక్కల షాపుల్లో చిన్నచిన్న వస్తువులు కొనుగోలు చేస్తే  దాని పై  ఎక్స్పైరీ  డేట్  కనిపించదు. ఇల్లు శుభ్రం చేయడానికి చీపురు కొనేటపుడు చీపురు ఎలా ఉందో, ఎంత రేటు ఉందో గమనిస్తాం కానీ చీపురుపై వేసిన రేపర్, దానిపై ఏం రాసి ఉందో గమనించరు. ఇంటికి తెచ్చిన వెంటనే కవర్ చించి మన అవసరాలకు వాడుకుంటాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి చీపురు కవర్‌ను పోస్ట్ చేశాడు. దాని పై ఎం వ్రాసి ఉందొ తెలుసా... 

కొలెస్ట్రాల్ గురించి ప్రజలకు సరైన సమాచారం లేదు. ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారుతోంది. దీని గురించిన సమాచారం అందించాలని ఈ చీపురు కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొలెస్ట్రాల్ గురించి ప్రజలకు తెలియజేయడానికి చీపురు   కవర్‌ను ఉపయోగించారు. కొలెస్ట్రాల్, సోడియం, కొవ్వు పదార్థాలతో సహా కొంత సమాచారం కవర్‌పై వ్రాయబడింది. సోషల్ మీడియా యూజర్లు దీన్ని జోక్‌గా తీసుకుని ఫన్నీ కామెంట్స్  కూడా చేశారు. 

ఈ ఫోటో ట్విట్టర్ ఖాతా (@baldwhiner)లో పోస్ట్ చేయబడింది. మీరు ఈ  పోస్ట్‌లో చీపురు కవర్ నోడ్‌ని చూడవచ్చు. దీనిపై పూర్తి క్యాలరీ చార్ట్ ఉంది. కొలెస్ట్రాల్, సోడియం, కొవ్వు గురించి మొత్తం రాసి ఉంటుంది. ఈ వ్యక్తి పోస్ట్ చేసిన  ఫోటోపై ‘ఎవరైనా తినాలనుకుంటే’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు.

కొద్దీ రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ ఫోటోను ఇప్పటివరకు 31,000 మందికి పైగా వీక్షించారు. దీనికి 491 లైక్‌లు వచ్చాయి ఇంకా 85 కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేయబడింది. దీనిని  అమెరికాలోని ఓ మెక్సికన్ కంపెనీ తయారు చేసిన చీపురు అని తెలిసింది. 

చీపురు కవర్‌పై ఉన్న కేలరీల లిస్ట్ ట్విట్టర్ వినియోగదారులు ఎగతాళి చేశారు. ఈ చీపురును 30 నిమిషాల పాటు వాడితే 300 కేలరీలు ఖర్చవుతాయని ఓ వ్యక్తి కామెంట్ చేయగా..  ఆశ్చర్యకరంగా, చీపురు పుల్లలోని పోషక విలువలు మనకు తెలియవని మరొకరు  కామెంట్ చేసారు. భార్య తన భర్తను చీపురుతో కొడుతుందని మరొకరు ఇంకా  సాస్ తో తింటే బెస్ట్ అని కామెంట్ పోస్ట్ చేసారు. గదిని, ఇంటిని ఇంకా  పక్క ఇంటిని శుభ్రం చేస్తే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి అని సలహా ఇచ్చాడు. 

మీరు అత్యవసర పరిస్థితుల్లో దీన్ని తినవచ్చు ఇంకా భారతదేశంలో ఏదైనా జరగవచ్చు, ఇది కేలరీలను తగ్గిస్తుంది?  అంటూ  ఇచ్చిన వివిధ కామెంట్లను కూడా మీరు చూడవచ్చు.  

 

the broom has a calorie chart …

in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k

— JΛYΣƧΉ  (@baldwhiner)
click me!