ఇక మీ పర్సనల్ చాట్ సేఫ్ గా ఉంటుంది.. ఎవరూ చదవలేరు.! వాట్సాప్ కొత్త అద్భుతమైన ఫీచర్ ..

By asianet news telugu  |  First Published May 18, 2023, 3:48 PM IST

ఈ ఫీచర్ ప్రకారం యూజర్లు వారి  ప్రైవేట్ చాట్‌లు, కాంటాక్ట్‌లు ఇంకా గ్రూప్‌లను లాక్ చేసుకోవచ్చు. వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లను ఎవరు యాక్సెస్ చేయగలరో పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. 


ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 'చాట్ లాక్' ప్రైవసీ ఫీచర్ ఇప్పుడు గుర్తించబడుతోంది. ఈ ఫీచర్ ప్రకారం యూజర్లు ప్రైవేట్ చాట్‌లు, కాంటాక్ట్‌లు ఇంకా  గ్రూప్‌లను లాక్ చేసుకోవచ్చు. యూజర్లు వారి ప్రైవేట్ చాట్‌లను ఎవరు యాక్సెస్ చేయవచ్చో  పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. WabetInfo నివేదిక ప్రకారం, ఒకసారి చాట్ లాక్ చేయబడితే, యూజర్ మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలరు. ఇందుకు వారి ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌కోడ్ ఉపయోగించి లాక్ సెట్ చేవచ్చు.

అనుమతి లేకుండా యూజర్  ఫోన్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే, ముందుగా చాట్‌ను క్లియర్ చేయమని యాప్ యూజర్ని అడుగుతుంది. సింపుల్ గా  చెప్పాలంటే  దానిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ముందు స్పష్టమైన విండో ఓపెన్ అవుతుంది. లాక్ చాట్ ఫీచర్ లాక్ చేయబడిన చాట్‌లో పంపబడిన ఫోటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీకి ఆటోమేటిక్ డౌన్‌లోడ్ చేయకుండా చూసుకుంటుంది.

Latest Videos

undefined

WhatsApp చాట్ లాక్ ఫీచర్‌ని సెట్ చేయడానికి, మీరు ముందుగా యాప్‌ను అప్‌డేట్ చేయాలి. తరువాత మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌కి వెళ్లండి. WhatsApp తెరిచి, మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌కు నావిగేట్ చేయండి.  కాంటాక్ట్స్ లేదా గ్రూప్ ప్రొఫైల్ ఫోటో పై నొక్కండి. అప్పుడు కనిపించే ఆప్షన్ నుండి "చాట్ లాక్" ఎంచుకోండి. మీరు "చాట్ లాక్" అనే కొత్త ఎంపికను చూసే వరకు మెనుని క్రిందికి స్క్రోల్ చేయండి.

మీరు "చాట్ లాక్"పై  నొక్కిన తర్వాత అది ఆల్వేస్ ఎనేబుల్ చేసి ఉంటుంది. లాక్ చేయబడిన అన్ని చాట్‌లను యాక్సెస్ చేయడానికి క్రిందికి స్వైప్ చేయండి. మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న లాక్ చేయబడిన చాట్‌పై నొక్కండి. మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఎంచుకోండి. చాట్‌ను అన్‌లాక్ చేయడానికి ఫోన్ పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌లను (అందుబాటులో ఉంటే) ఎంటర్ చేయండి.  

click me!