BSNL VIP Number:బి‌ఎస్‌ఎన్‌ఎల్ వి‌ఐ‌పి నంబర్.. ఆన్‌లైన్‌లో ఎలా పొందాలనుకుంటే..?

By asianet news telugu  |  First Published Feb 25, 2022, 4:13 PM IST

బి‌ఎస్‌ఎన్‌ఎల్ అన్ని సర్కిల్‌లలోని కస్టమర్‌లకు వి‌ఐ‌పి నంబర్‌లను జారీ చేస్తుంది. ఇందుకు వేలం ఒక్కో సర్కిల్‌కు భిన్నంగా ఉంటుంది. వేలంలో పాల్గొనడానికి, మీరు బి‌ఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ సర్కిల్‌లో వేలం షెడ్యూల్‌ను చూడాల్సి ఉంటుంది.
 


చాలా టెలికాం కంపెనీలు కస్టమర్లకు ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్లను ఇస్తుంటాయి. వాటిలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)పేరు కూడా ఉంది. బి‌ఎస్‌ఎన్‌ఎల్ లేదా మరేదైనా టెలికాం కంపెనీ వి‌ఐ‌పి నంబర్‌ పొందాలనుకునే వారు మీలో చాలా మందే ఉంటారు. ప్రజలు సాధారణంగా వి‌ఐ‌పి లేదా ఫ్యాన్సీ నంబర్లను తీసుకుంతుంటారు ఎందుకంటే వీటిని గుర్తుంచుకోవడం చాలా సులభం. వి‌ఐ‌పి నంబర్‌లు సాధారణంగా ఒకే అంకె చాలా సార్లు(repeated) కలిగి ఉంటాయి. బి‌ఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ అండ్ ప్రీ-పెయిడ్ కస్టమర్‌ల కోసం వి‌ఐ‌పి నంబర్‌లను జారీ చేస్తుంది. బి‌ఎస్‌ఎన్‌ఎల్ వి‌ఐ‌పి నంబర్ వేలం వేయబడుతుంది. బి‌ఎస్‌ఎన్‌ఎల్ వి‌ఐ‌పి నంబర్‌ను ఎలా పొందాలంటే..?

బి‌ఎస్‌ఎన్‌ఎల్ వి‌ఐ‌పి నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పొందాలి?
బి‌ఎస్‌ఎన్‌ఎల్  టెలికాం అన్నీ సర్కిల్‌లలోని కస్టమర్‌లకు వి‌ఐ‌పి నంబర్‌లను జారీ చేస్తుంది. అయితే వేలం ఒక్కో సర్కిల్‌కు భిన్నంగా ఉంటుంది. వేలంలో పాల్గొనడానికి, మీరు బి‌ఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ సర్కిల్‌లో వేలం షెడ్యూల్‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

Latest Videos

*ముందుగా మీరు బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఇ-వేలం (https://eauction.bsnl.co.in/auction1/eauction.aspx) సైట్‌కి వెళ్లి మీ సర్కిల్‌ను ఎంచుకోవాలి.
*ఇప్పుడు లాగిన్/రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
*మీరు లాగిన్ కోసం మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్‌ను అందించవచ్చు.
*దీని తర్వాత లాగిన్ వివరాలు మీ ఇమెయిల్‌కు లింక్‌తో వస్తాయి.
*లింక్‌లో ఇచ్చిన లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, మొబైల్ నంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
*లాగిన్ అయిన తర్వాత, మీరు వి‌ఐ‌పి నంబర్‌ల జాబితాను చూస్తారు, అందులో మీరు మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవచ్చు.
*నంబర్‌ని ఎంచుకున్న తర్వాత దాన్ని కార్ట్‌(cart)కి జోడించండి.
*దీని తర్వాత మీరు రీఫండ్ చెల్లింపు రిజిస్ట్రేషన్ డబ్బును చెల్లించాలి.
*ఇక్కడ మీరు నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ కోసం డబ్బు సమాచారాన్ని చూడవచ్చు.
*రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఎంచుకున్న నంబర్ కోసం కనీస బిడ్ వేయాలి.
*దీని తర్వాత బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఒక్కో వీఐపీ నంబర్‌కు ముగ్గురు వ్యక్తులను ఎంపిక చేస్తుంది.
*ఈ చివరి జాబితా తర్వాత కూడా మరొక వేలం ఉంటుంది, ఆ తర్వాత మీకు వి‌ఐ‌పి నంబర్ వస్తుంది.
*చివరి జాబితాలో మీ పేరు కనిపించకపోతే, మీరు మీ రిజిస్ట్రేషన్ డబ్బును 10 రోజుల్లోపు తిరిగి పొందుతారు.
*మీరు వి‌ఐ‌పి నంబర్ కోసం ఒకోసారి రూ. 25,000 వరకు చెల్లించాల్సి రావచ్చు.

click me!