వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ఆఫర్లను వివిధ నెట్ వర్క్ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. తక్కువ ధరలోనే ఎక్కువ డేటా అందిస్తోంది. అయితే ప్రస్తుతం నెట్‌వర్క్ కంపెనీలు అందిస్తున్న డేటా ప్లాన్స్‌పై వినియోగదారుల్లో చాలా అసంతృప్తి ఉంది. ఈ లోటును తీర్చడం కోసం ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు అదిరిపోయే డేటా ప్లాన్స్‌ను అందిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కీలకమైన అంశం. వాటి ద్వారానే సర్వం సమకూరుతాయి. అయితే ప్రస్తుతం నెట్‌వర్క్ కంపెనీలు అందిస్తున్న డేటా ప్లాన్స్‌పై వినియోగదారుల్లో చాలా అసంతృప్తి ఉంది. ఈ లోటును తీర్చడం కోసం ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే BSNL ఆమోదయోగ్యమైన డేటా ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. 600 రూపాయల కంటే తక్కువ ధరతో రోజుకు 5GB డేటాతో BSNL సూపర్ ప్లాన్‌ను ప్రారంభించింది. బీఎస్ఎన్‌ఎల్‌తో మరిన్ని టెలికాం కంసెనీలు కూడా ఇంచుమించు ఇలాంటి ఫ్లాన్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
BSNL రూ. 599 ప్లాన్: ఈ ప్లాన్ వినియోగదారులకు ప్రతిరోజూ 5 GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో.. రోజువారిగా అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలు. విశేషమేమిటంటే ఈ ప్లాన్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అపరిమిత ఉచిత డేటా కూడా అందించబడుతుంది. ఇది కాకుండా, మీరు ఉచిత కాలర్ ట్యూన్, జింగ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు.
undefined
Vi రూ. 599 ప్లాన్: Vi రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు 70 రోజుల పాటు ప్రతిరోజూ 1.5 GB డేటా అందించబడుతుంది. ఇందులో కూడా అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు ఇవ్వబడతాయి. డేటా డిలైట్‌లు, వారాంతపు రోల్‌ఓవర్ బింగే ఆల్ నైట్ ఆఫర్‌లతో కూడిన Vi Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో ఈ ప్లాన్ ఉంది
Airtel రూ. 599 ప్లాన్: Airtel రూ. 599 ప్లాన్‌లో ప్రతిరోజూ 3 GB డేటా అందించబడుతుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్యాక్‌లో రోజుకు 100 SMSలు కూడా ఉచితం. Airtel, ఇతర నెట్‌వర్క్‌ల వాయిస్ కాలింగ్ నిమిషాలు అపరిమితంగా ఉంటాయి. కస్టమర్‌లు సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. ఇది కాకుండా, ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో హెలోట్యూన్స్, షా అకాడమీకి చెందిన సంవత్సరం పాటు ఉచిత ఆన్‌లైన్ కోర్సు. ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్‌లు కూడా అందించబడతాయి.