రియల్‌మీ 5 ప్రో మిడ్‌రేంజ్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న మొదటి ఫోన్. అయితే రియల్‌మీ 8 అనేది ఈ విభాగంలో 64 మెగాపిక్సెల్ కెమెరాతో ఉన్న ఫోన్ ఇంకా ఇప్పుడు 108 మెగాపిక్సెల్ Samsung ISOCELL HM6 సెన్సార్‌తో రియల్‌మీ 9 సిరీస్‌ను పరిచయం చేస్తోంది.
శాంసంగ్ ISOCELL HM6 సెన్సార్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు రియల్‌మీ (Realme) తెలిపింది. ఈ లెన్స్ 108 మెగాపిక్సెల్స్‌తో వస్తుంది. అలాగే ప్రతి ఫోన్‌తో ప్రతిసారీ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసినట్లు కంపెనీ తెలిపింది. రియల్‌మీ 5 ప్రో మిడ్‌రేంజ్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న మొదటి ఫోన్. రియల్‌మీ 8 అనేది దాని విభాగంలో 64 మెగాపిక్సెల్ కెమెరాతో ఉన్న ఫోన్ ఇంకా ఇప్పుడు 108 మెగాపిక్సెల్ Samsung ISOCELL HM6 సెన్సార్‌తో రియల్‌మీ 9 సిరీస్‌ను పరిచయం చేస్తోంది.
Samsung ISOCELL HM6 ఇమేజ్ సెన్సార్ ఫీచర్స్
ఈ సెన్సార్ 3Sum-3Avg అప్‌గ్రేడ్ వెర్షన్ Nonapixel ప్లస్ టెక్నాలజీతో అమర్చబడింది. నోనా టెక్నాలజీలోని 9సమ్ పిక్సెల్‌ల కారణంగా, కెమెరాకు వచ్చే కాంతి మొత్తం 123% ఎక్కువ. ISOCELL HM6 సెన్సార్‌తో కూడిన Realme 9 సిరీస్ కెమెరా మెరుగైన లైటింగ్, మెరుగైన లో లైట్ ఫోటోగ్రఫీ ఇంకా బెటర్ కలర్ కరెక్షన్‌ని పొందుతుంది. ఈ లెన్స్‌తో అల్ట్రా జూమ్ కూడా అందుబాటులో ఉంటుంది, దీని సహాయంతో జూమ్ చేసిన తర్వాత కూడా మంచి ఫోటోస్ క్లిక్ చేయవచ్చు.
undefined
రియల్‌మీ సి31 మార్చి 31న భారతదేశంలో లాంచ్ అవుతుందని ఇటీవల రియల్‌మీ వెల్లడించింది. రియల్‌మీ సి31 ఈ సెగ్మెంట్‌లో భారతదేశపు అత్యంత స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ అని రియల్‌మీ పేర్కొంది. యల్‌మీ సి31లో Unisoc T612 ప్రాసెసర్ అందించారు. అంతేకాకుండా యల్‌మీ సి31లో 5000mAh బ్యాటరీ అందుబాటులో ఉంటుంది.
ఇండోనేషియాలో యల్‌మీ సి31 ప్రారంభ ధర 1,599,000 ఇండోనేషియా రూపాయి అంటే దాదాపు రూ. 8,500. ఈ ధర వద్ద 3జిబి ర్యామ్ తో 32జిబి స్టోరేజ్ లభిస్తుంది. డార్క్ గ్రీన్ అండ్ లైట్ సిల్వర్ కలర్‌లో ఈ ఫోన్ ని ఇండోనేషియాలో ప్రవేశపెట్టరు.
మరోవైపు లాంచ్ ముందు, ఒక లీక్ రిపోర్ట్ ప్రకారం రియల్‌మీ 9 స్టోరేజ్, ర్యామ్, కలర్ ఆప్షన్స్ అవకాశాలను వెల్లడించింది. రియల్‌మీ 9 4జి రెండు వేరియేషన్లలో లభ్యమవుతుంది - వీటిలో 6జిబి ర్యామ్ అండ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 8జిబి ర్యామ్ తో 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ కోసం కలర్ ఆప్షన్స్ - సన్‌బర్స్ట్ గోల్డ్, మెటోర్ బ్లాక్, స్టార్‌గేజ్ వైట్ ఉన్నాయి.
రియల్‌మీ 9 5జి 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో 2400×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz సాంప్లింగ్ రేటు, 600 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ తో ప్యాక్ ఉంటుంది. హుడ్ కింద, ఫోన్ 6జిబి వరకు LPDDR4x ర్యామ్, 128జిబి UFS 2.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో Mediatek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000mAh బ్యాటరీ లభిస్తుంది.