బెస్ట్ బడ్జెట్ టాబ్లెట్‌లు: ఈ గొప్ప ఫీచర్లు ఉన్న టాబ్లెట్‌ ధర 20 వేల కంటే తక్కువే..

By asianet news telugu  |  First Published Jan 16, 2023, 1:52 PM IST

తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్‌తో  కొత్త సంవత్సరంలో చాలా గొప్ప ఫీచర్లతో కూడిన టాబ్లెట్‌లు కూడా విడుదలయ్యాయి. టాబ్లెట్‌తో మీరు పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇంకా మెరుగైన సౌండ్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. 


డిజిటల్ మార్కెట్‌లో ట్యాబ్లెట్‌లకు ఇప్పుడు మళ్లీ డిమాండ్ పెరిగింది. నోకియా, శాంసంగ్, చైనీస్ బ్రాండ్‌లతో పాటు ఇతర కంపెనీలు కూడా ట్యాబ్లెట్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్‌తో  కొత్త సంవత్సరంలో చాలా గొప్ప ఫీచర్లతో కూడిన టాబ్లెట్‌లు కూడా విడుదలయ్యాయి. టాబ్లెట్‌తో మీరు పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇంకా మెరుగైన సౌండ్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. అంటే, సినిమాలు చూడటం నుండి సోషల్ మీడియాను స్క్రోలింగ్ చేయడం వరకు, టాబ్లెట్ చాలా ఉపయోగకరమైన డివైజ్. ఇప్పుడు టాబ్లెట్‌లు బడ్జెట్ ధరలో కూడా వస్తున్నాయి. మీరు మంచి ఫీచర్లు అలాగే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో కూడిన బడ్జెట్ టాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే వీటిపై ఒక లుక్కెయండి. ఈ నివేదికలో రూ. 20,000 లోపు ఐదు బెస్ట్ టాబ్లెట్‌ల గురించి తెలుసుకుందాం...

రియల్ మీ పాడ్ ఎక్స్ 
రియల్ మీ  తాజా టాబ్లెట్ ప్రారంభ ధర రూ.19,999. రియల్ మీ పాడ్ ఎక్స్  1200x2000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 11-అంగుళాల WUXGA+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6 జి‌బి వరకు ర్యామ్, 128జి‌బి వరకు స్టోరేజ్ అందించారు. ఈ ట్యాబ్‌లో 5 జి‌బి వరకు వర్చువల్ ర్యామ్ కూడా ఉంది, అంటే ట్యాబ్ స్టోరేజ్ అవసరమైతే ర్యామ్ గా ఉపయోగించవచ్చు.  13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా  ఉంది. దీనిలో  డాల్బీ అట్మోస్‌తో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. అంతేకాకుండా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 8340mAh బ్యాటరీ ఉంది.  

Latest Videos

undefined

లేనోవా టాబ్ ఎం10
లేనోవా టాబ్ ఎం10 10.61-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్ ప్లే, క్వాల్ కం స్నాప్ డ్రాగన్ SDM 6803 ప్రాసెసర్‌ ఉంది.  6జి‌బి LPDDR4x ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ సహాయంతో టాబ్లెట్ స్టోరేజ్ 1టి‌బి వరకు విస్తరించవచ్చు. దీనిలో 7700mAh బ్యాటరీ  ఉంది. ఈ టాబ్లెట్‌లో 8 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.  6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 19,999గా ఉంది.

ఒప్పో ప్యాడ్ ఎయిర్
ఒప్పో ప్యాడ్ ఎయిర్ లో 10.36-అంగుళాల 2K డిస్‌ప్లే, 2,000x1,200 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ColorOS 12 ఈ టాబ్లెట్‌లో లభిస్తుంది. ఈ టాబ్లెట్‌లో ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 6ఎన్‌ఎం అండ్ 4 జి‌బి LPDDR4x ర్యామ్ ఉంది, దీనిని వర్చువల్‌గా 7జి‌బి వరకు విస్తరించవచ్చు. క్వాడ్ స్పీకర్లు టాబ్లెట్‌లో  ఉన్నాయి, ఇంకా డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుంది. టాబ్లెట్‌లో 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. దీనికి  7,100mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందుతుంది. 64 జి‌బి స్టోరేజ్ 4 జి‌బి ర్యామ్ వేరియంట్ ధర రూ. 15,499, 128జి‌బి స్టోరేజ్ 4 జి‌బి ర్యామ్ వేరియంట్ ధర రూ. 19,999కే కొనుగోలు చేయవచ్చు.


స్యామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఏ8
గెలాక్సీ టాబ్ ఏ8 ప్రారంభ ధర రూ. 13,999. ట్యాబ్‌లో 10.5-అంగుళాల డిస్‌ప్లే, Unisoc T618 ప్రాసెసర్ ఉంది. ఇందులో నాలుగు స్పీకర్లు ఉన్నాయి, ఇవి డాల్బీ అట్మోస్‌తో వస్తాయి. వెనుక వైపు  8 మెగాపిక్సెల్‌ కెమెరా,ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ట్యాబ్‌లో 7040mAh బ్యాటరీ ఇచ్చారు. ట్యాబ్ 4 జి‌బి వరకు ర్యామ్, 64జి‌బి  వరకు స్టోరేజ్ పొందుతుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.  

రియల్ మీ ప్యాడ్
రియాలిటీ ప్యాడ్ కూడా తక్కువ ధరలో గొప్ప ఎంపిక. రియల్ మీ ప్యాడ్ 10.4-అంగుళాల డిస్‌ప్లేను పొందుతుందని భావిస్తున్నారు, ఇంకా 2,000x1,200 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను పొందవచ్చు. టాబ్లెట్ 8MP బ్యాక్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా  పొందుతుంది. అలాగే, ట్యాబ్ 7100 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్‌ని ప్రారంభ ధర రూ.16,499 వద్ద కొనుగోలు చేయవచ్చు.
 

click me!