ఈ ఫోన్ ని మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్ అండ్ స్టార్రీ బ్లూ కలర్‌లలో లాంచ్ చేసారు. ఈ ఫోన్ 8జిబి RAMతో 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 799 యూరోలు అంటే సుమారు రూ. 64,500
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్ Asus Zenfone 9 ను గురువారం విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Asus నుండి వస్తున్న చిన్నదైన కానీ శక్తివంతమైన ఫోన్. ఈ ఫోన్ 5.9-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ ప్లే, 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఇచ్చారు. ఫోన్‌లో మీరు గరిష్టంగా 16జిబి RAMతో 256జిబి స్టోరేజ్ చూడవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర అండ్ స్పెసిఫికేషన్ గురించి మీకోసం..
Asus Zenfone 9 ధర
Asus Zenfone 9 మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్ అండ్ స్టార్రీ బ్లూ కలర్‌లలో లాంచ్ చేసారు. ఈ ఫోన్ 8జిబి RAMతో 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 799 యూరోలు (సుమారు రూ. 64,500). 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. ఫోన్ బేస్ వేరియంట్‌ను తైవాన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు, ఇతర వేరియంట్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతర వేరియంట్ల ధరల సమాచారాన్ని కంపెనీ త్వరలో విడుదల చేయనుంది.
undefined
స్పెసిఫికేషన్‌లు
Asus Zenfone 9 120Hz రిఫ్రెష్ రేట్, 1,080x2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 5.9-అంగుళాల పూర్తి HD+ Samsung AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1,100 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత ZenUIతో వస్తుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ 256 GB UFS 3.1 స్టోరేజ్ ఇంకా 16 GB వరకు LPDDR5 RAMని పొందుతుంది. HDR10, HDR10+, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dirac HD సౌండ్‌కి సపోర్ట్ కూడా ఫోన్‌లో అందించారు.
కెమెరా
Asus Zenfone 9 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ Sony IMX766 f/1.9 ఎపర్చరుతో వస్తుంది. రెండవ కెమెరా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ IMX368 సెన్సార్, f/1.9 ఎపర్చరుతో వస్తుంది. ఫోన్ ప్రైమరీ కెమెరాలో సిక్స్ యాక్సెస్ గింబల్ స్టెబిలైజర్‌కు సపోర్ట్ ఉంది. సెల్ఫీ కోసం 12-మెగాపిక్సెల్ సోనీ IMX663 సెన్సార్, ఎపర్చరు f/2.45 ఉంటుంది. 8K వరకు వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ కూడా ఫోన్‌లో ఉంది.
బ్యాటరీ
Asus Zenfone 9 4,300mAh బ్యాటరీని, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi 6/6E, బ్లూటూత్ v5.2, GPS/A-GPS / NavIC, NFC, FM రేడియో, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రిసిస్టంట్ కోసం IP68 రేటింగ్ పొందుతుంది. ఫోన్ బరువు 169 గ్రాములు.