అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్: ఇప్పుడు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చౌకగా, ఒక రీఛార్జ్ చాలు..

By asianet news teluguFirst Published Jun 15, 2023, 5:58 PM IST
Highlights

Amazon ప్రైమ్ లైట్ ప్లాన్ ఇంతకుముందు కొంతమంది సెలెక్ట్ చేసిన వినియోగదారులకు  మాత్రమే విడుదల చేయబడింది. ఇప్పుడు కంపెనీ కస్టమర్లందరికీ ఈ ప్లాన్‌ని అందుబాటులోకి తెచ్చింది.
 

మీరు OTTలో వెబ్ సిరీస్‌లు ఇంకా సినిమాలను చూడాలనుకుంటున్నట్లయితే మీకో గుడ్ న్యూస్ ఉంది. ఏడాది పొడవునా నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన బ్యాంగ్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ ధరకు వచ్చేసింది. ఈ చౌక ప్లాన్‌ను అమెజాన్ ప్రైమ్ ప్రవేశపెట్టింది. దీని పేరు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్. 999 రూపాయలతో ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలి ఇంకా సంవత్సరం మొత్తం ఫ్రీ ఉంటుంది. దీనిలో ప్రతినెల, 3 నెలలు ఇంకా అన్యువల్  ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కంపెనీ రూ. 1,499 వార్షిక ప్లాన్‌ను అందించింది. 

అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ ఫీచర్లు

*Amazon ప్రైమ్ లైట్ ప్లాన్ ఇంతకుముందు కొంతమంది సెలెక్ట్ చేసిన వినియోగదారులకు  మాత్రమే విడుదల చేయబడింది. ఇప్పుడు కంపెనీ కస్టమర్లందరికీ ఈ ప్లాన్‌ని అందుబాటులోకి తెచ్చింది.

*రూ. 999 ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు HD కంటెంట్, రెండు డివైజెస్ సపోర్ట్,  ఫాస్ట్ డెలివరీ సపోర్ట్ పొందవచ్చు. ప్రైమ్ లైట్‌లో కూడా   ప్రకటనలు ఉంటాయి.

*ఈ అమెజాన్ మెంబర్‌షిప్ స్టాండర్డ్ ప్రైమ్ మెంబర్‌షిప్ కంటే రూ.500 తక్కువ.

*ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో పాటు, కంపెనీ వినియోగదారులకు రెండు రోజుల ఉచిత డెలివరీ, స్టాండర్డ్ డెలివరీ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఉచిత స్టాండర్డ్  డెలివరీ కోసం కనీస ఆర్డర్ నియమం కూడా ఉండదు.

*అమెజాన్ పే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు కంపెనీ ప్రతి కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

*ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత కస్టమర్‌లు అమెజాన్  ప్రైమ్ మెంబర్‌ల కోసం ప్రత్యేకమైన  లైట్నింగ్ డీల్స్,  డీల్ ఆఫ్ ది డేకి కూడా యాక్సెస్ పొందుతారు.

*ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో యాప్ కి ఆన్ లిమిటెడ్ యాక్సెస్ కంపెనీ ఇస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ప్లాన్
అమెజాన్ లాగా నెట్‌ఫ్లిక్స్ కూడా కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్లాన్‌లతో వస్తోంది. సబ్‌స్క్రైబర్‌ బేస్‌ని పెంచాలన్నది కంపెనీ ప్లాన్‌. ఇందుకోసం కంపెనీ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ధరలో కొంత తగ్గింపును కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

click me!