ఆన్ లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మధ్య నూతన సంవత్సరంలో ఆఫర్ల యుద్ధం ప్రారంభమవుతోంది. అమెజాన్ సంస్థ ఈ నెల 19 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చి 23వ తేదీ వరకు లభిస్తాయి. ఇక ఫ్లిప్ కార్టులో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆఫర్లు అందజేస్తోంది.
ముంబై: ఆన్‌లైన్ కొనుగోలు దారులకు పండగే పండగ. 2019లో తొలి డిస్కౌంట్ల సేల్ షురూ అవుతోంది. దిగ్గజ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలన్నీ రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించనున్నాయి. ఈ వరుసలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ క్యూ కట్టాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ సేల్‌ను ప్రకటించించింది.
అమెజాన్ జనవరి 20 నుంచి 23 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్పెషల్ విక్రయాలకు తెరతీయనుంది. ముఖ‍్యంగా ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంచింది. ప్రైమ్ సభ్యుల కోసం ఈ నెల 19 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ మొదలవుతుంది. పలు క్యాటగిరీల్లో 17 కోట్ల ఉత్పత్తులపై ఆఫర్లున్నాయి.
వన్‌ప్లస్ 6టీ, శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్స్, హానర్, రియల్‌మీ, జియోమీ వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళళ్లపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ వసతితోపాటు దాదాపు రూ. లక్ష దాకా క్రెడిట్ వసతి కూడా కల్పిస్తుంది.
వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్, నిత్యావసర వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఇక అమెజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇ-రీడర్స్‌పై రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
మరోవైపు అమెజాన్ ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్ కార్ట్ కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోళ్లు జరిపిన వారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కల్పిస్తోంది. ఫ్లిప్ కార్ట్ పలు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై 70 శాతం వరకు బై బ్యాక్ కల్పిస్తోంది. ఫ్లిప్ కార్టులో రియల్ మీ 2 ప్రో, శామ్ సంగ్ గ్యాలక్సీ ఎస్8, ఒప్పో ఎఫ్ 9, మోటరోలా వన్ పవర్ తదితర మోడల్ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై ఆఫర్లు లభించనున్నాయి.