యూట్యూబ్‌లో మళ్లీ హైక్వాలిటీ హెచ్‌డి వీడియోలు.. లాక్‌డౌన్‌ సడలింపుతో నిషేధం తొలగింపు..

By Sandra Ashok Kumar  |  First Published Nov 6, 2020, 3:05 PM IST

మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  దీంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ల మీద అధిక భారం పడింది. దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్‌ మార్చి నెలలో 1080 పిక్సల్‌ హెడీ వీడియోలను నిలిపివేసింది.


భారతదేశంలోని మొబైల్ నెట్‌వర్క్‌లలో 1080పి హెచ్‌డి క్వాలిటీ వీడియోలను యూట్యూబ్  ప్రసారం చేస్తోంది. మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  దీంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ల మీద అధిక భారం పడింది.

దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్‌ మార్చి నెలలో 1080 పిక్సల్‌ హెడీ వీడియోలను నిలిపివేసింది. బ్రాడ్ బ్యాండ్, మొబైల్ నెట్‌వర్క్‌లు పై అధిక భారం పడకుండా నిరోధించే ప్రయత్నంలో యూట్యూబ్ 480పి రిజల్యూషన్‌లో వీడియోలను ప్రసారం చేసింది.

Latest Videos

undefined

కానీ ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుతో ప్రజలు ఆఫీసులకు, కార్యాలయాలకు తిరిగి వెళ్తున్నారు. తాజాగా వీడియో రిజల్యూషన్‌పై పరిమితిని  తొలగించి హెచ్‌డీ క్వాలిటీలో వీడియోలు చూసే అవకాశాన్ని తిరిగి యూట్యూబ్‌ కల్పించింది.

అయితే జూలైలో స్మార్ట్‌ఫోన్‌లలో వై-ఫై, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లలో అధిక-నాణ్యత వీడియోలను (4 కె రిజల్యూషన్ వరకు) అనుమతించడం ద్వారా యూట్యూబ్ ఈ చర్యను సడలించింది.

దీంతో భారతదేశంలో మళ్లీ హెచ్‌డీ 1080 పిక్సల్‌ హెచ్‌డి వీడియోలకు యూట్యూబ్‌ అనుమతినిచ్చింది. వైఫై నెట్‌వర్క్‌ ద్వారా వీడియోలను హై క్వాలిటీలో చూడొచ్చు. కొన్ని ఫోన్స్‌లో 1080 పిక్సల్‌ వీడియోలు ప్లే అవుతుండగా కొన్ని మొబైల్స్‌లో 1440 పిక్సల్‌ వీడియోలు ప్లే అవుతున్నాయి.

అయితే రీసెంట్‌గా విడుదలై ఐవోఎస్‌తో నడిచే ఐఫోన్ XR, ఐఫోన్ 11 వంటి వాటిలో ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా 4కే వీడియోలను ప్లే చేయవచ్చు.

యూట్యూబ్ ఈ పరిమితిని అనేక దేశాలలో స్ట్రీమింగ్ సేవ కోసం కొన్ని నెలలు మాత్రమే విధించింది. అయితే భారతదేశంలో, జూలై నాటికి బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లపై ఈ పరిమితిని ఎత్తివేయవలసిన అవసరాన్ని యూట్యూబ్ భావించింది.  

click me!