గూగుల్ పే, ఫోన్‌ పేకి పోటీగా ఇండియాలోకి మరో కొత్త అమెరికన్ పేమెంట్ యాప్..

By Sandra Ashok KumarFirst Published Nov 6, 2020, 12:50 PM IST
Highlights

మల్టీబ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి వాట్సాప్ పే వినియోగంలో ఉంటుందని  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 

ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ టెక్నాలజీ మార్కెట్లో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కొత్తగా పేమెంట్ సేవలను ప్రారంభించడానికి  భారతదేశం అనుమతించింది.

 మల్టీబ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి వాట్సాప్ పే వినియోగంలో ఉంటుందని  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

యూ‌ఎస్ సంస్థ ఫేస్‌బుక్ ముందుగా 20 మిలియన్ల మంది వినియోగదారులతో ప్రారంభించి తరువాత యుపిఐ స్థావరాన్ని క్రమంగా విస్తరించనుంది.

ఫేస్‌బుక్ సంస్థ భారతదేశంలో వాట్సాప్ పేమెంట్ ను కొన్నేళ్లుగా పరీక్షిస్తోందన్న సంగతి మీకు తెలిసిందే, అయితే రెగ్యులేటరీ అడ్డంకులు కారణంగా ఈ వాట్సాప్ పేమెంట్ యాప్ పైలట్ ప్రాజెక్టును చాలా తక్కువ సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంచాయి.

also read వాట్సాప్‌లో స్నాప్‌చాట్‌ లాంటి మరో కొత్త ఫీచర్‌.. వాటిని ఈజిగా డిలీట్ చేయవచ్చు.. ...

భారతదేశ పేమెంట్ మార్కెట్లో  పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి డజన్ల కొద్దీ ఇతర స్టార్టప్‌ పేమెంట్ యాప్స్ వినియోగంలో ఉన్నాయి. అయితే వీటికి పోటీగా వాట్సాప్ పేమెంట్ యాప్ భారతదేశంలో డిజిటల్ పేమెంట్లను ప్రారంభించనుంది.

ఇండియాలో ఇన్స్టంట్  మెసేజింగ్ యాప్ వాట్సాప్  ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ కారణంగ వాట్సాప్ పేమెంట్ యాప్ కూడా ఎక్కువ వినియోదారులను జోడించగలదు. ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్  కు భారతదేశం అతిపెద్ద ముఖ్యమైన మార్కెట్.

ఈ ఏడాది ఆరంభంలో ఫేస్‌బుక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. వాట్సాప్ పేమెంట్ సర్వీస్ చిన్న వ్యాపారాల నుండి సైతం నేరుగా వస్తువుల కొనుగోలు, అమ్మకాలను  ప్రోత్సహించగలవు. 

click me!