యూట్యూబ్ సరికొత్త అద్భుతమైన ఫీచర్... రాత్రి సమయాల్లో వారి కోసం..

By Sandra Ashok Kumar  |  First Published May 30, 2020, 5:10 PM IST

ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజెస్ లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని, రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని యూట్యూబ్ తెలిపింది. 
 


ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ యాప్ అయిన యూట్యూబ్ “బెడ్‌టైమ్ రిమైండర్‌” అనే కొత్త డిజిటల్ ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, సినిమాలు, పలు షోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రాత్రి వేళలోయూట్యూబ్‌ చూస్తున్నపుడు మీ నిద్రకి ఆటంకం కలిగించకుండ ఉండడానికి ఈ సరికొత్త ఫీచర్‌ని యూట్యూబ్ ప్రవేశ పెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనావైరస్ మహమ్మారి, లాక్ డౌన్, సామాజిక దూరం నిబంధనల మధ్య ప్రజలు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, వీడియో గేమ్‌లు, వీడియో కాల్‌లు ఇంకా మరెన్నో యాప్స్ పై ఎక్కువగా ఆధారపడతారు, తద్వారా స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Latest Videos

undefined

ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజెస్ లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని, రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని యూట్యూబ్ తెలిపింది. 

aslo read ఇక పై ఫోన్‌కు 11 అంకెల మొబైల్‌ నెంబర్లు.?

యూట్యూబ్‌లోకి సైన్ ఇన్ చేశాక > సెటింగ్స్ లోకి వెళ్లండి> “నిద్ర పోయే సమయం వచ్చినప్పుడు రెమైండ్ మీ”> అనే దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయండి> రిమైండర్ కోసం ప్రారంభం, ఎండ్ సమయాన్ని ఎంచుకోండి. 

మీరు పడుకునే సమయంలో ఏదైనా వీడియొ చూస్తున్నాప్పుడు అది పూర్తి చేయాలనుకుంటే, రిమైండర్ సెటప్ చేసేటప్పుడు “వెయిట్ అంటిల్ ద వీడియో ఈజ్ ఓవర్” అనే ఆప్షన్ ఎంచుకోవాలి. రిమైండర్‌ను 10 నిమిషాలు స్నూజ్ చేయాలనుకుంటే కూడా  చేయవచ్చు అలాగే డిస్‌మిస్‌ కూడా చేసుకోవచ్చు.
 

click me!