ఇక పై ఫోన్‌కు 11 అంకెల మొబైల్‌ నెంబర్లు.?

By Sandra Ashok Kumar  |  First Published May 30, 2020, 4:28 PM IST

ఇక పై 11 అంకెల మొబైల్‌ నంబర్ల ను వినియోగం లోకి తీసుకు రావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్య ను పెంచు కోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది.  ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్ల ను వాడుక లోకి తీసుకు రావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.


ఇక పై దేశం లో 11 అంకెలతో కూడిన మొబైల్​ నంబర్లు.మొబైల్‌ నంబర్ల విషయం లో టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కీలక ప్రతిపాదనలు చేసింది. దేశం లో 11 అంకెల మొబైల్‌ నంబర్‌ ను వినియోగించాలని ప్రతిపాదించింది. 

పలువురి తో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను శుక్రవారం విడుదల చేసింది.దేశం లో ప్రస్తుతం 10 అంకెల మొబైల్‌ నంబర్లు ఉన్నాయి. ఇక పై 11 అంకెల మొబైల్‌ నంబర్ల ను వినియోగం లోకి తీసుకు రావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్య ను పెంచు కోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది. 

Latest Videos

undefined

ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్ల ను వాడుక లోకి తీసుకు రావచ్చని ట్రాయ్‌ పేర్కొంది. ఇక పై ల్యాండ్‌ లైన్ల నుంచి మొబైల్స్‌ కు కాల్‌ చేస్తే వాటి నంబర్ల ముందు సున్నా (0) కలపాలని ట్రాయ్‌ పేర్కొంది.  అయితే, ల్యాండ్‌ లైన్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌ కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌ కు, మొబైల్‌ నుంచి మొబైల్‌ కు కాల్స్‌ చేస్తే సున్నా అవసరం లేదని తెలిపింది. 

also read వెంటనే జూమ్ యాప్ అప్‌గ్రేడ్ చేసుకోండీ...లేదంటే..?

ప్రస్తుతం డాంగిల్స్‌ కు పదెంకల నంబర్లే ఉన్నాయి. ఇక పై వాటిని 13 అంకెలకు పెంచాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.వినియోగదారుల పెరుగుదలకు అనుగుణంగా 11-అంకెల మొబైల్ నంబర్లను ట్రాయ్ సిఫార్సు చేస్తుంది.

2050 నాటికి భారతదేశంలో అవసరాలను తీర్చడానికి 4.68 బిలియన్ మొబైల్ నంబర్లు సరిపోతాయని ట్రాయ్ అంచనా వేసింది.సెల్యులార్ మొబైల్ ఆపరేటర్లు ఈ సంఖ్యల కోసం ప్రైవేట్-నంబరింగ్ సిరీస్‌ను అందించడం కూడా సాధ్యమే. 
 

click me!