
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మరో కొత్త మొబైల్ ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్‌లో షియోమి షేర్ చేసిన టీజర్ ద్వారా ఎంఐ 10ఐ క్వాడ్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో ఈ కొత్త ఫోన్ జనవరి 5న లాంచ్ అవుతుందని వెల్లడించింది.
108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో చైనాలో ఇటీవల విడుదల చేసిన రీబ్రాండెడ్ రెడ్‌మి నోట్ 9 ప్రో 5జి మోడల్ భారతదేశంలో లాంచ్ చేయవచ్చని సూచించింది. చైనాలో లాంచ్ చేసిన 5జి మోడల్ భారతదేశంలో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 9 ప్రో మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎంఐ 10 సిరీస్ లో భాగంగా ఎంఐ 10 ప్రో, ఎంఐ 10 లైట్, ఎంఐ 10 అల్ట్రా, ఎంఐ 10 లైట్ జూమ్ ఎడిషన్ మొబైల్స్ ఉన్నాయి.
also read వాట్సాప్ యూసర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు వెబ్ వెర్షన్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి.. ...
ఎంఐ 10ఐ ఇటీవల గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ M2007J17Iతో కనిపించింది. గీక్‌బెంచ్‌లో వెబ్‌సైట్‌లో వెలువడిన వివరాల ప్రకారం షియోమీ తీసుకురాబోయే ఫోన్ 8జీబీ ర్యామ్ తో రానుంది. ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ స్కోరు 652, మల్టీ-కోర్ స్కోరు 2,004ను పొందింది. ఇది ఔట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం.
ఎంఐ 10ఐ ఫీచర్లు
గత నెలలో చైనాలో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 9 ప్రో 5జి రీబ్రాండెడ్ మోడల్‌గా ఎంఐ 10ఐ ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచించాయి. ఎంఐ 10ఐలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి (2,400x1,080 పిక్సెల్స్) డిస్ ప్లే, 6 జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 750జి సోసి ప్రాసెసర్ తీసుకురానున్నట్లు సమాచారం.
108 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ కాకుండా, క్వాడ్ కెమెరా సెటప్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉంటాయి. ముందు భాగంలో, మి 10ఐ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌లో రానుంది.