వాట్సాప్ యూసర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు వెబ్ వెర్షన్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి..

By S Ashok KumarFirst Published Dec 21, 2020, 8:23 PM IST
Highlights

 ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులు డెస్క్‌టాప్ స్క్రీన్‌పై కూడా ఆడియో, వీడియో కాల్‌లను చేయడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్‌ కేవలం మొబైల్ యాప్ వెర్షన్ లోనే ఉండేది.

న్యూ ఢీల్లీ: వాట్సాప్ వెబ్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నవారికి పెద్ద ఉపశమనం కలిగించెందుకు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్‌ను రూపొందిస్తోంది.

ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులు డెస్క్‌టాప్ స్క్రీన్‌పై కూడా ఆడియో, వీడియో కాల్‌లను చేయడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్‌ కేవలం మొబైల్ యాప్ వెర్షన్ లోనే ఉండేది.

వాట్సాప్‌ను ట్రాక్ చేసే ఒక వెబ్‌సైట్ ప్రకారం ఆడియో, వీడియో కాల్స్ కోసం ఇప్పుడు వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ లో కొత్త ఫీచర్ రానున్నట్లు, అయితే ఇది ప్రస్తుతానికి చాలా పరిమితమైన ప్రయోగంగా కనిపిస్తోందని, బటన్లు కూడా బీటా లేబుల్‌ తో వస్తున్నాయి అని చూపించింది.

ఆడియో, వీడియో కాల్స్ చేసే ఆప్షన్ కొంతమంది వాట్సాప్ బీటా వినియోగదారులకు ప్రత్యక్షమైంది, చాట్ విండో పైన ఉన్న సెర్చ్ బటన్‌తో పాటు వీటికి బీటా ట్యాగ్‌లు కూడా ఉన్నాయి.

also read 

కొన్ని రోజుల నుండి కొంతమంది వినియోగదారులు వాట్సాప్ డెస్క్‌టాప్ లోని చాట్ హెడర్‌లో కాల్ బటన్‌ను చూస్తున్నారు" అని నివేదించింది. డెస్క్‌టాప్ యాప్ కి కనెక్ట్ కావడానికి వినియోగదారులకు ఫోన్ అవసరమని వెల్లడించింది.

ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూపించడానికి ఒక వెబ్ సైట్ గతంలో స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసింది. వెబ్ సైట్ ప్రకారం, మీరు వాట్సాప్ వెబ్ నుండి కాల్స్ కోసం మీరు ఇన్‌కమింగ్ కాల్‌ను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించగల పాప్ అప్ విండో కనిపిస్తుంది.

మీరు ఎవరికైనా కాల్ చేసినపుడు, వాట్సాప్ మరొక విండోను చూపుతుంది, దీనిలో కాల్ స్టేటస్ ఉంటుంది. అలాగే ఈ ఫీచర్ గ్రూప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

  ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్‌ ఒకేసారి వీడియో లేదా వాయిస్ కాల్‌లో పాల్గొనే వారి సంఖ్యను నాలుగు నుండి ఎనిమిదికి పెంచింది. వాట్సాప్ కాల్‌లలో కొత్త పరిమితిని అక్సెస్ చేయడానికి కాల్‌లో పాల్గొనే వారందరూ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ తాజా వెర్షన్‌కి యాప్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
 

click me!