ప్రపంచంలోనే మొదటిసారిగా బయోనిక్ కన్నుతో అంధులకు తిరిగి కంటిచూపు పొందే అవకాశం : పరిశోధకులు

By Sandra Ashok KumarFirst Published Sep 23, 2020, 11:38 AM IST
Highlights

కంటి చూపు లేని వారికి నేత్ర దానం ద్వారా తిరిగి కంటి చూపుని తెచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. కానీ కంటి చూపు పొందాలనుకునే వారికి నేత్ర దానం చేసే వారు ఉండాలి. తాజాగా కంటి చూపు లేని వారికి తిరిగి కంటి చూపు తెచ్చేందుకు శాస్త్రీయంగా పరిశోధనలు చేశారు. 

కంటి చూపు లేని వారి జీవితం వర్ణించలేనిది. గత కొంతకాలంగా నేత్ర దానం పై వినే ఉంటారు. కంటి చూపు లేని వారికి నేత్ర దానం ద్వారా తిరిగి కంటి చూపుని తెచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. కానీ కంటి చూపు పొందాలనుకునే వారికి నేత్ర దానం చేసే వారు ఉండాలి.

తాజాగా కంటి చూపు లేని వారికి తిరిగి కంటి చూపు తెచ్చేందుకు శాస్త్రీయంగా పరిశోధనలు చేశారు. అందులో విజయవంతమైన ఫలితాలను కూడా చూసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రపంచంలోని మొదటి బయోనిక్ కన్ను ద్వారా మెదడు ఇంప్లాంట్ సహాయంతో కాంటి చూపు దృష్టిని తిరిగి తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్  మోనాష్ విశ్వవిద్యాలయంలో బయోనిక్ కన్నుని అభివృద్ది చేసింది.

also read 

మోనాష్ విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఆర్థర్ లోవరీ మాట్లాడుతూ “ 172 స్పట్స్ లైట్స్ (ఫాస్ఫేన్స్)డిజైన్ కలయికల నుండి దృశ్య నమూనాను సృష్టిస్తుంది, ఇది వ్యక్తికి లోపలికి మరియు బయటి వాతావరణాలను నావిగేట్ చేయడానికి సమాచారాన్ని అందిస్తుంది, అంతేకాకుండా వారి చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువుల ఉనికిని కూడా గుర్తిస్తుంది. ” అని అన్నారు.

"లింబ్ పక్షవాతం, క్వాడ్రిప్లేజియా వంటి చికిత్స చేయలేని వాటితో బాధపడుతున్న ప్రజలకు వారి జీవితాలను మెరుగుపర్చడంలో సహాయపడటానికి వారు అడ్వాన్స్ సిస్టం ద్వారా ముందుకు వేళ్లాలని చూస్తున్నారు" అని పరిశోధకులు తెలిపారు.

మొత్తం రెండు వందల గంటల అనుకరణతో తక్కువ దుష్ప్రభావాలతో గొర్రెలపై చేసిన ప్రయోగాలను పరిశోధకులు విజయవంతమైన ఫలితాలను చూశారని ఇండియాటైమ్స్.కామ్ నివేదించింది.

మొట్టమొదటి మానవ క్లినికల్ ట్రయల్ కోసం దీనిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి పరిశోధకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం మెల్ బోర్న్ పరిశోధకులు  పరిశోధనలు నిర్వహించాలని భావిస్తున్నారు. తయారీ ప్రక్రియ, పంపిణీని వేగవంతం చేయడానికి పరిశోధకులు మరింత నిధులను పొందాలని చూస్తున్నాట్లు సమాచారం.


 

click me!