రిలయన్స్ జియో కొత్త సర్వీస్.. పోస్ట్‌పెయిడ్ ప్లస్ తో కస్టమర్లకు బంపర్ ఆఫర్..

By Sandra Ashok KumarFirst Published Sep 22, 2020, 5:00 PM IST
Highlights

రిలయన్స్ జియో భారతదేశంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఎన్నడూ లేని ప్రయోజనాలతో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన జియో  పోస్ట్‌పెయిడ్ ప్లస్ సర్వీస్ లక్ష్యం ఏంటంటే దేశం అంతటా కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ పిరియెన్స్ లో ఉన్నతమైన సేవలను అందించడం అని తెలిపింది.

ముంబై, 22 సెప్టెంబర్ 2020: పోస్ట్‌పెయిడ్ సేవల విభాగాన్ని మార్చే ప్రయత్నంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఎన్నడూ లేని ప్రయోజనాలతో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను పరిచయం చేస్తోంది.

ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన జియో  పోస్ట్‌పెయిడ్ ప్లస్ సర్వీస్ లక్ష్యం ఏంటంటే దేశం అంతటా కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ పిరియెన్స్ లో ఉన్నతమైన సేవలను అందించడం అని తెలిపింది.

ఈ పోస్ట్‌పెయిడ్ సర్వీస్ గురించి జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ “జియో  పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం. 400 మిలియన్ల జియో వినియోగదారుల నమ్మకం సంపాదించిన తరువాత ప్రీపెయిడ్ విభాగంతో పాటు మేము ఇప్పుడు మా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు విస్తరించాలనుకుంటున్నాము.

ప్రతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమ్మకమైన, అధిక-నాణ్యత కనెక్టివిటీ, ఆన్ లిమిటెడ్  ప్రీమియం ఎంటర్టైన్మెంట్, అంతర్జాతీయ రోమింగ్, అత్యాధునిక ఫీచర్స్, చాలా ముఖ్యంగా కస్టమర్ అనుభవం కోసం జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూపొందించబడింది. మేము భారతదేశంలోని ప్రతి పోస్ట్‌పెయిడ్ వినియోగదారుడు దీనిని పూర్తిగా ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము. ” అని అన్నారు.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ లోని కొన్ని ముఖ్యమైన  ఫీచర్లు:
ఎంటర్టైన్మెంట్ ప్లస్
1. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ & డిస్నీ + హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్
2.650 పైగా లైవ్ టీవీ ఛానెల్స్, వీడియో కంటెంట్, 5 సిఆర్ సాంగ్స్, 300 పైగా న్యూస్‌పేపర్‌లతో జియో యాప్ కలిగి ఉంది

ఫీచర్స్ ప్లస్
1- రూ.250తో మీ పూర్తి కుటుంబానికి ఉపయోగపడే ఫ్యామిలి ప్లాన్ 
2- 500 జిబి వరకు డేటా రోలవర్
3- భారతదేశంతో పాటు విదేశాలలో వైఫై-కాలింగ్ సదుపాయం

ఇంటర్నేషనల్ ప్లస్
1- విదేశాలలో ప్రయాణించే భారతీయయుల కోసం మొట్టమొదటి-ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ
2- యూ‌ఎస్‌ఏ & యూ‌ఏ‌ఈలో ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్
3- ఇంటర్నేషనల్ కాలింగ్ (ఐ‌ఎస్‌డి) ప్రతి నిమిషానికి 50పైసలు వద్ద ప్రారంభమవుతుంది


ఎక్స్ పిరియేన్స్ ప్లస్
1- జియో లో క్రెడిట్ లిమిట్ కొనసాగించవచ్చు
2- ఒకే  నెంబర్ , డౌన్‌టైమ్ (ఎం‌ఎన్‌పి)
3- ఉచిత హోమ్ డెలివరీ & యాక్టివేషన్
4- ప్రీమియం కాల్ సెంటర్ సర్వీస్


జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ఎలా పొందాలీ:
పోస్ట్‌పెయిడ్ యూజర్లు జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ లో చేరాలని కోరుకుంటున్నావారు
స్టెప్  1: మీ ప్రస్తుత ఆపరేటర్ క్రెడిట్ లిమిట్ కొనసాగిస్తు వాట్సప్ లో 88-501-88-501 నెంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ పంపండి.
స్టెప్ 2: మీ & మీ కుటుంబ సభ్యుల కోసం జియోపోస్ట్‌పాయిడ్ ప్లస్ సిమ్ ఇంటి వద్దనే పొందవచ్చు.లేదా (JIO.COM/POSTPAID లేదా కాల్ 1800 88 99 88 99) లేదా మీ సమీప జియో స్టోర్ / రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సందర్శించండి. మీ సమీప జియో స్టోర్ కోసం http://jio.com/store-locator పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మైజియో యాప్‌లో మీ జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ఫ్యామిలీ ప్లాన్‌కు మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ సభ్యులను లింక్ చేయండి.

ప్రిపెయిడ్ యూజర్లు జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో చేరాలని కోరుకుంటే
స్టెప్  1: మీ మరియు మీ కుటుంబ సభ్యుల కోసం జియోపోస్ట్‌పైడ్ ప్లస్ సిమ్ ఇంటి వద్దనే  పొందవచ్చు ఇందుకోసం JIO.COM/POSTPAID లేదా కాల్ 1800 88 99 88 99 ఫోన్ చేయవచ్చు లేదా మీ సమీప జియో స్టోర్ / రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సందర్శించండి. మీ సమీప జియో స్టోర్ కోసం http://jio.com/store-locator  పై క్లిక్ చేయండి.
స్టెప్  2: 100% పునర్వినియోగ డిపాజిట్‌తో మీ క్రెడిట్ లిమిట్ అన్‌లాక్ చేయండి 
స్టెప్ 3: మైజియో యాప్‌లో మీ జియోపోస్ట్‌పెయిడ్  ప్లస్ ఫ్యామిలీ ప్లాన్‌కు మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ సభ్యులను లింక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
- జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 24 నుండి జియో స్టోర్స్‌లో అలాగే హోమ్ డెలివరీ ద్వారా కూడా లభిస్తుంది
-  జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ పై మరిన్ని వివరాల కోసం www.jio.com/postpaid ని సందర్శించండి


రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ గురించి: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రపంచ స్థాయి ఆల్-ఐపి డేటాను బలంగా నిర్మించింది. ఇది సరికొత్త 4జి ఎల్‌టిఇ టెక్నాలజీ నెట్‌వర్క్. వాయిస్ ఓవర్ ఎల్‌టిఇ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

ఇది భవిష్యత్తులో 5జి, 6జి లేదా అంతకు మించి టెక్నాలజికి సులభంగా అప్‌గ్రేడ్ చేయబడతాయి. ప్రతి ఒక్కరూ జియో డిజిటల్ లైఫ్ ఆనందించడానికి  కస్టమర్ ఆఫర్లలో భాగంగా జియో ఇండియన్ టెలికాంలో విప్లవాత్మక మార్పులు చేసింది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, సరసమైన డేటా మార్కెట్‌గా చేస్తుంది.

మరింత సమాచారం కోసం సంప్రదించండి:
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్
Jio.CorporateCommunication@ril.com
022-44753591

click me!