సురక్షితమైన పేమెంట్ల కోసం పేటీఎం కొత్త పాకెట్-సైజ్ డివైజ్ లాంచ్‌..

By Sandra Ashok KumarFirst Published Aug 10, 2020, 1:05 PM IST
Highlights

2021 ఆర్థిక సంవత్సరంలో ఈ డివైజెస్ పంపిణీ, మార్కెటింగ్ కోసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న పేటీఎం, వచ్చే కొద్ది నెలల్లో రెండు లక్షల డివైజెస్ జారీ చేయనున్నట్లు తెలిపింది, ఇవి నెలకు 20 మిలియన్లకు పైగా లావాదేవీలను చేయగలవు.
 

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సర్వీస్ పేటీఎం సోమవారం ఆండ్రాయిడ్ ఆధారిత, పాకెట్-సైజ్ పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) డివైజ్ లాంచ్ చేసింది. ఇంటిగ్రేటెడ్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్, క్యూఆర్ స్కానింగ్ కోసం కెమెరా, 4జి సిమ్ కార్డులు, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం రూ.499 నెలవారీ అద్దెకు లభిస్తుంది, పేటీఎం ఆల్ ఇన్ వన్ పోర్టబుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పిఓఎస్ ఆర్డర్లు, పేమెంట్లకు సహకరిస్తుంది.

2021 ఆర్థిక సంవత్సరంలో ఈ డివైజెస్ పంపిణీ, మార్కెటింగ్ కోసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న పేటీఎం, వచ్చే కొద్ది నెలల్లో రెండు లక్షల డివైజెస్ జారీ చేయనున్నట్లు తెలిపింది, ఇవి నెలకు 20 మిలియన్లకు పైగా లావాదేవీలను చేయగలవు.

"పాకెట్ -సైజ్ ఆండ్రాయిడ్ పిఓఎస్ డివైజ్ ఎస్‌ఎం‌ఈలు చిన్న, మధ్యతరహా సంస్థలు నుండి కిరణా స్టోర్స్ డెలివరీ వరకు ప్రతి ఒక్కరికీ పేమెంట్లను సురక్షితంగా చేయడానికి వీలు కల్పిస్తుంది" అని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేణు సత్తి అన్నారు.

also read  

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న పోర్టబుల్ లైనక్స్ ఆధారిత పిఓఎస్ డివైజెస్ కంటే ఇది చాలా శక్తివంతమైనది, సురక్షితమైనదని కంపెనీ తెలిపింది. పిఓఎస్ డివైజ్ పేటీఎం 'స్కాన్ టు ఆర్డర్' సర్వీస్ తో కలిసి వస్తుంది. ఎర్గోనామిక్ డివైజ్ 163 గ్రాముల బరువు, 12 ఎం‌ఎం మందం, 4.5 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది.

  శక్తివంతమైన ప్రాసెసర్, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడానికి, పేమెంట్లను తక్షణమే ప్రాసెస్ చేయడానికి ఇన్‌బిల్ట్ కెమెరాతో వస్తుంది. బిల్లింగ్, పేమెంట్, కస్టమర్ నిర్వహణ కోసం క్లౌడ్-ఆధారిత సాఫ్ట్‌వేర్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.  4జి సిమ్ కార్డులు, వై-ఫైతో పనిచేస్తుంది. పేమెంట్లు ఎప్పటికీ ఫెల్ కాకుండా నిర్ధారించడానికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.

జిఎస్టి కంప్లైంట్ బిల్లులను ఉత్పత్తి చేయడానికి, అన్ని లావాదేవీలు నిర్వహించడానికి స్మార్ట్ పిఓఎస్ డివైజ్ 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్  తో అనుసంధానించిందని కంపెనీ తెలిపింది. పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ 20 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్  యాప్ స్టోర్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన బిజినెస్ యాప్ లో ఇది ఒకటి.
 

click me!