ఒబామా, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఎకౌంట్లు హ్యాక్..

By Sandra Ashok Kumar  |  First Published Jul 16, 2020, 11:04 AM IST

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ప్రముఖ వ్యక్తుల ఖాతాలు హ్యాక్ గురయ్యాయి. హ్యాక్ అయిన ఖాతాలలో బరాక్ ఒబామా, జో బిడెన్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మైక్ బ్లూమ్‌బెర్గ్, ఎలన్ మస్క్, కాన్యే వెస్ట్ తో పాటు ఇతరులు అకౌంట్లు కూడా ఉన్నాయి.
 


సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ లో అమెరికాకు చెందిన ప్రముఖ వ్యక్తుల ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. క్రిప్టోకరెన్సీని ఫోర్క్ చేయమని అనుచరులను ప్రోత్సహిస్తూ హ్యాక్ చేసిన ఖాతాల ద్వారా పోస్ట్ చేసింది.

 బిట్‌కాయిన్ స్కామ్‌తో ఆ హ్యాకింగ్‌కు సంబంధం ఉన్న‌ట్లు తెలుస్తోంది. హ్యాక్ అయిన ఖాతాలలో బరాక్ ఒబామా, జో బిడెన్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మైక్ బ్లూమ్‌బెర్గ్, ఎలన్ మస్క్, కాన్యే వెస్ట్ ఇతర ప్రముఖుల అకౌంట్లు కూడా  ఉన్నాయి.

Latest Videos

undefined

ముఖ్యంగా ఉబెర్, ఆపిల్ కార్పొరేట్ ఖాతాలు కూడా హ్యాక్ గురయ్యాయి. బిట్‌కాయిన్ ద్వారా పేమెంట్ చేసే ప్రతి $ 1,000 డాలర్లకు  $ 2,000 తిరిగి పంపిస్తానంటూ ఫెక్ ట్వీట్లు వారి అకౌంట్లలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ ఫెక్ ట్వీట్లు వెంటనే ట్విట్టర్ తొలగించింది.

బిలియనీర్ టెల్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలన్ మస్క్ అకౌంట్లో క్రిప్టోకరెన్సీని అభ్యర్థించే ఒక ట్వీట్ తొలగించింది  కానీ కొంతసేపటి  తరువాత మళ్ళీ  మరొకటి కనిపించింది. ట్విట్టర్ అకౌంట్లపై భద్రతా  ప్రభావం చూపే సంఘటనలపై ట్విట్టర్ స్పందించింది.

also read 

మేము దీనిపై దర్యాప్తు చేస్తున్నాము దీనిని వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాము. త్వరలో అందరి అకౌంట్లు కూడా అప్‌డేట్ చేస్తాము "అని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. "మేము ఈ హ్యాక్ సంఘటనను సమీక్షించి, పరిష్కరించేటప్పుడు మీరు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం లేదా ట్వీట్స్ చేయలేరు" అని ట్విట్టర్ తెలిపింది.  

ట్రోన్ వ్యవస్థాపకుడు, బిట్టొరెంట్ సి‌ఈ‌ఓ జస్టిన్ సన్ హ్యాకింగ్ కారణమైన వారిపై 1 మిలియన్ డాలర్ల నజరాన  ప్రకటించారు. బిట్‌టొరెంట్ వ్యవస్థాపకుడు & సి‌ఈ‌ఓ జస్టిన్ సన్  ప్రముఖుల అకౌంట్లను హక్ చేసిన వారిని గుర్తించి, పట్టిస్తే వారికి  1 మిలియన్ల మొత్తంలో అందిస్తానన్నారు.

ఈ మొత్తం డబ్బును కూడా వారికి అతను వ్యక్తిగతంగా చెల్లిస్తానన్నాడు. ఈ అకౌంట్ల హ్యాక్ వెనక ఉన్న హ్యాకర్లు / వ్యక్తుల వల్ల మా కమ్యూనిటీపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది "అని బిట్‌టొరెంట్  అధికారిక ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రముఖుల ఖాతాల హ్యాక్ కారణంగా ట్రేడింగ్ డేటా ప్రకారం ట్విట్టర్ షేర్లు క్షీణించాయి.
 

click me!