జనవరి 1 తరువాత టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ కొంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Dec 29, 2020, 12:10 PM ISTUpdated : Dec 29, 2020, 11:02 PM IST
జనవరి 1 తరువాత  టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ కొంటున్నారా..  అయితే ఈ విషయం తెలుసుకోండి..

సారాంశం

 కొత్త సంవత్సరం నుండి ఎల్‌ఈడీ టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ మరికొన్ని ఇతర గృహోపకరణాల ధరలు 10 శాతం వరకు పెరగవచ్చు. వీటి ధరలు పెరగడానికి రాగి, అల్యూమినియం, ఉక్కు ధరలు పెరగడమే ప్రధాన కారణం.

మీరు టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ లేదా ఇతర గృహోపకరణాలను కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే వెంటనే కొనండి, మీకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది, ఎందుకంటే కొత్త సంవత్సరం నుండి ఎల్‌ఈడీ టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ మరికొన్ని ఇతర గృహోపకరణాల ధరలు 10 శాతం వరకు పెరగవచ్చు. వీటి ధరలు పెరగడానికి రాగి, అల్యూమినియం, ఉక్కు ధరలు పెరగడమే ప్రధాన కారణం. అదనంగా సముద్ర రవాణా ఖర్చు కూడా పెరిగింది.

టీవీ ప్యానెళ్ల ధరలలో 20% పెరుగుదల

గ్లోబల్ విక్రేతల నుండి సరఫరా తగ్గడం వల్ల టీవీ ప్యానెళ్ల ధరలు 200 శాతం పెరిగాయని అలాగే ముడిచమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్ కూడా మరింత ఖరీదైనదని తయారీదారులు అంటున్నారు. ఈ కారణంగా పానాసోనిక్ ఇండియా, ఎల్‌జి, థామ్సన్ వాటి ఉత్పత్తుల ధరలను జనవరి నుండి పెంచాలని నిర్ణయించాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి సోని కూడా త్వరలో ధరల పెరుగుదలపై నిర్ణయం తీసుకొనున్నది. 

also read ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో షియోమి ఎం‌ఐ 11 లాంచ్.. ఫీచర్స్ ఇవే.. ...

ఏ సంస్థ ధరలను పెంచింది

పానాసోనిక్ ఉత్పత్తి ధరలు జనవరిలో ఆరు నుండి ఏడు శాతం పెరగవచ్చు. అలాగే ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ అన్ని ఉత్పత్తులు జనవరి 1 నుండి ఏడు నుండి ఎనిమిది శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు ప్రధానంగా ఉన్నాయి. సోనీ తన ఉత్పత్తి ధరల పెంపు పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ధరలను పెంచడానికి కంపెనీల బలవంతం

ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, కోడాక్ బ్రాండ్ నుండి టీవీల అమ్మకపు ధర 20 శాతం పెరిగింది. కాబట్టి జనవరి నుంచి ఆండ్రాయిడ్ టీవీ ధరలను 20 శాతం పెంచాలని థామ్సన్, కోడాక్ నిర్ణయించాయి. కరోనా లాక్‌డౌన్ లో కార్యకలాపాలు తగ్గయని, దీంతో  అవసరమైన లోహాల ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని కంపెనీలు చెబుతున్నాయి.

అలాగే సరుకు రవాణా ఖర్చు కూడా ఐదు నుంచి ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది. ఇది మొత్తం ఖర్చును 20 శాతం నుండి 25 శాతానికి పెంచింది. ఇటువంటి పరిస్థితిలో ధరలను పెంచడం తప్పనిసరి సంస్థలు పేర్కొన్నాయి 

PREV
click me!

Recommended Stories

Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?