ఇప్పుడు ఈ వాట్సాప్ స్టిక్కర్లు వినియోగదారుల ఇష్టాలకు, కోరికలకు అనుగుణంగా ఈ స్టీక్కర్స్ రూపొందించారు. క్రిస్మస్ ముందు కూడా వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను ప్రవేశపెట్టింది, క్రిస్మస్ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపేందుకు వీటిని ఉపయోగించవచ్చు.
క్రిస్మస్ సందర్భంగా వాట్సాప్ గ్రూపులలో, చాట్లలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇన్‌స్టంట్-మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ మెర్రీ క్రిస్మస్ స్టిక్కర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ వాట్సాప్ స్టిక్కర్లు వినియోగదారుల ఇష్టాలకు, కోరికలకు అనుగుణంగా ఈ స్టీక్కర్స్ రూపొందించారు. క్రిస్మస్ ముందు కూడా వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను ప్రవేశపెట్టింది,
క్రిస్మస్ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపేందుకు వీటిని ఉపయోగించవచ్చు. వాట్సాప్ ఉపయోగించి క్రిస్మస్ స్టిక్కర్లను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపించడంలో మీకు సహాయపడటానికి ఒక వివరణాత్మక మార్గదర్శిని ఇచ్చింది. ఈ స్టీక్కర్లు మిగతా వాటి కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది.
undefined
వాట్సాప్ క్రిస్మస్ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?
1.చాట్ బార్ ఎడమ వైపున ఉన్న ఎమోజి గుర్తుపై క్లిక్ చేసి, ఆపై స్టిక్కర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయడంతో వాట్సాప్ స్టిక్కర్స్ విభాగానికి వెళ్లొచ్చు.
2. స్టిక్కర్స్ విండో మూలలో ఉన్న ప్లస్ (+) ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇది వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న అన్ని స్టిక్కర్ ప్యాక్‌లను చూపించే కొత్త విండోను ఓపెన్ చేస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ స్టిక్కర్ ప్యాక్‌ల జాబితా కానీపిస్తుంది. వీటిలో ప్రస్తుతం మెర్రీ, బ్రైట్ అని పిలువబడే ఒక క్రిస్మస్ స్టిక్కర్ ప్యాక్ ఉంది.
3. స్టీక్కర్స్ ప్యాక్ మొత్తం పొందడానికి దాని పక్కనే ఉన్న డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేయండి లేదా ప్యాక్‌లో లభించే స్టిక్కర్‌లను చూడటానికి స్టిక్కర్ పేరుపై నొక్కండి.
4.మీరు మొత్తం ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేయకూడదనుకుంటే, కావలసిన స్టిక్కర్‌పై నొక్కండి తరువాత పాప్-అప్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఇష్టమైన స్టిక్కర్‌లను జోడించాలనుకుంటున్నారా? అని ఆప్షన్ కనిపిస్తుంది, అప్పుడు యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీ వాట్సాప్ మెసెంజర్ లో స్టీక్కర్స్ యాడ్ అవుతాయి.
థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వాట్సాప్ క్రిస్మస్ స్టిక్కర్ ప్యాక్‌లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే ?
1. థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, యాప్ స్టిక్కర్ స్టోర్‌లోని డిఫాల్ట్ స్టిక్కర్ జాబితా కింద గెట్ మోర్ స్టిక్కర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్‌కు తీసుకెళ్తుంది.
2. గూగుల్ ప్లే స్టోర్‌లో క్రిస్మస్ వాట్సాప్ స్టిక్కర్‌ల కోసం సెర్చ్ లో టైప్ చేయండి. వాట్సాప్ స్టిక్కర్లను అందించే యాప్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో ఏదైనా యాప్స్ ప్రయత్నించవచ్చు, డౌన్‌లోడ్ చేయడానికి ముందు స్టార్ రేటింగ్‌లను చెక్ చేసుకోండీ.
3. ఈ యాప్స్ మొత్తం క్రిస్మస్ స్టిక్కర్ ప్యాక్‌లతో నిండి ఉంటాయి, శాంటా గిఫ్ట్స్, అన్ని రకాల క్రిస్మస్ స్టీక్కర్స్, వివిధ రకాల క్రిస్మస్ చెట్లు, స్నోమ్యాన్ స్టీక్కర్స్ ఉంటాయి.
4. మీరు సెలెక్ట్ చేసుకున్నా స్టిక్కర్ ప్యాక్‌ల కింద ఉన్న యాడ్ టు వాట్సాప్ బటన్ పై క్లిక్ చేయండి తరువాత స్టిక్కర్లు మీ వాట్సాప్ మెసెంజర్ లో యాడ్ అవుతాయి. మీకు ఇష్టమైన వారికి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి మీరు వాటిని మీ చాట్స్‌లో సులభంగా ఉపయోగించవచ్చు.
5.డౌన్ లోడ్ చేసుకున్న స్టిక్కర్లు స్టిక్కర్ల పేజీలో, డౌన్‌లోడ్ చేసిన ఇతర స్టిక్కర్ ప్యాక్‌ల పక్కన కనిపిస్తాయి. అప్పుడు మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు వాటిని సెండ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఐఓఎస్ యూజర్లు వాట్సాప్‌లో థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేయలేరు.