Truecaller Preload in Smartphones: దూసుకెళ్తోన్న ట్రూ కాల‌ర్‌.. ఇకపై ప్రీ-లోడ్ యాప్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 01:13 PM IST
Truecaller Preload in Smartphones: దూసుకెళ్తోన్న ట్రూ కాల‌ర్‌.. ఇకపై ప్రీ-లోడ్ యాప్

సారాంశం

ట్రూ కాలర్‌ యాప్‌ దూసుకెళ్తోంది. కాలర్ ఐడెంటిఫికేషన్‌లో ఈ యాప్‌నకు తిరుగులేదు. అయితే ఇకపై ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌లో ట్రూ కాలర్ యాప్‌ ప్రీ లోడెడ్‌గా రానుంది.

ట్రూ కాలర్‌ యాప్‌ దూసుకెళ్తోంది. కాలర్ ఐడెంటిఫికేషన్‌లో ఈ యాప్‌నకు తిరుగులేదు. అయితే ఇకపై ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌లో ట్రూ కాలర్ యాప్‌ ప్రీ లోడెడ్‌గా రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ కంపెనీలతో ట్రూకాలర్‌‌ యాప్ యాజమాన్యం ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఏదైనా కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే, ఈ యాప్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ట్రూ కాలర్ వర్గాలు తెలిపాయి.

అయితే, ప్రీలోడెడ్ గా తమ యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాన్ని ఉపయోగించాలా? వద్దా? అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చని ట్రూ కాలర్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ఫోన్లలో ప్రీలోడెడ్ యాప్ గా సేవలు అందించాలన్నది తమ ప్రణాళిక అని వివరించింది.

రాబోయే రెండేళ్లలో భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా మార్కెట్లలో సుమారు 100 మిలియన్‌ కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-లోడెడ్‌ యాప్‌గా ఇవ్వడం లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాదిలో ట్రూకాలర్ యూజర్లకు వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్‌ అనౌన్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. 

‘‘ట్రూకాలర్ లేటెస్ట్ వెర్షన్ యాప్‌ ఇక మీదట విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌గా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లకు ఈ యాప్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ట్రూకాల్‌ సీఈవో, వ్యవస్థాపకుడు అలెన్‌ మామెది తెలిపారు. ప్రస్తుతం ట్రూకాలర్‌కు భారత్‌లో 450 మిలియన్ల మంది యూజర్లు ఉండగా, వారిలో 220 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
2026 AI Impact : ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? నిపుణుల విశ్లేషణ ఇదే !