టిక్‌టాక్‌కు గూగుల్ ప్లే స్టోర్ చేయూత.. మళ్లీ టాప్ రేటింగ్..

By Sandra Ashok Kumar  |  First Published May 29, 2020, 12:28 PM IST

యాంటీ చైనా సెంటిమెంట్‌కు తోడు ఓ వీడియోపై తలెత్తిన వివాదం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రేటింగ్ తగ్గిపోయింది. కానీ సెర్చింజన్ గూగుల్ తనకు గల అధికారంతో టిక్ టాక్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా ఇచ్చే రేటింగ్‌లను తొలగించి వేసింది. ఫలితంగా టిక్ టాక్ రేటింగ్ 4.4కు చేరుకున్నది.
 


న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ రేటింగ్‌ మళ్లీ పుంజుకున్నది. ఇటీవల టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఆ యాప్‌ రేటింగ్‌ 4.5 నుంచి 1.2కి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ యాప్‌ రేటింగ్‌ మళ్లీ 4.4కి చేరింది. పడిపోయిన రేటింగ్ తిరిగి పెరగడానికి కారణాలేమిటి.. ఒక్కసారి పరిశీలిద్దాం..

ఇటీవల ఫైజల్‌ సిద్ధిఖీ అనే వ్యక్తి చేసిన వీడియోతో ఈ వివాదం మొదలైంది. యాసిడ్‌ దాడులను ప్రేరేపించేలా ఈ వీడియో ఉందని కొందరు నెటిజన్లు విమర్శించడంతో ఆ కంపెనీపై వ్యతిరేకత మొదలైంది. దీనికి యాంటీ చైనా సెంటిమెంట్‌ తోడవ్వడంతో #ఇండియన్స్ ఎగనెస్ట్ టిక్ టాక్, #బ్యాన్ టిక్ టాక్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్‌ అయ్యాయి.

Latest Videos

undefined

దీంతో కొందరు మూకుమ్మడిగా యాప్‌ రేటింగ్‌ను తగ్గించడం మొదలు పెట్టారు. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ రేటింగ్‌ 1.2కు పడిపోయింది. అయితే, టిక్‌టాక్‌ రేటింగ్‌ పెరగడంలో గూగుల్‌ ప్లేస్టోర్‌ కీలక పాత్ర పోషించింది. వన్‌ స్టార్‌ రేటింగ్స్‌ ఇచ్చిన 80 లక్షల వరకు రేటింగ్‌లను తొలగించింది.

వ్యతిరేక ప్రచారంతో ఉద్దేశ పూర్వకంగా ఇచ్చే రేటింగ్‌లను తొలగించే అధికారం గూగుల్‌కు ఉంది. ఈ మేరకు గూగుల్‌ వాటిని తొలగించింది. దీంతో టిక్‌టాక్‌ రేటింగ్‌ పుంజుకుంది. నిన్నటి వరకు 2.9గా ఉన్న రేటింగ్‌ ఇవాళ 4.4 కు చేరడం గమనార్హం. 

also read వొడాఫోన్‌లో గూగుల్‌ పెట్టుబడులు.. భారత టెలికం రంగంలోకి టెక్ దిగ్గజాలు...?

మరోవైపు టిక్‌టాక్‌పై వ్యతిరేకత మొదలైన సందర్భంలోనే దేశీయంగా కొన్ని యాప్‌లు పుంజుకున్నాయి. టిక్‌టాక్‌ తరహా యాప్‌ అయిన మిత్రోన్‌ అదే సమయంలో 50 లక్షల డౌన్‌లోడ్‌లు సొంతం చేసుకోవడం గమనార్హం.

మరోవైపు టిక్‌టాక్‌ మాతృ సంస్థ, స్టార్టప్‌ బైట్‌డ్యాన్స్‌ లాభాలతో దూసుకెళ్తుంది. 2019లో మొత్తం కంపెనీ రెవెన్యూలో 1700కోట్ల డాలర్లలో 300కోట్లు నికర ఆదాయం వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018 ఆదాయంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చైనాకు చెందిన  బైట్‌ డాన్స్‌ అత్యుత్తమ టెక్నాలజీతో ప్రపంచాన్ని అలరిస్తోంది.

బైట్‌ డాన్స్‌ కేవలం నెలలో 15 లక్షల మందిని వీక్షకులను సంపాదించుకుంటోంది. బైట్‌డ్యాన్స్‌కు టిక్‌టాక్‌తోపాటు డూయిన్‌, టోతియో వంటి యాప్‌ల సేవలను వినియోగించుకుంటుంది. అమెరికన్‌ టీనజర్లను డ్యాన్స్‌ వీడియోలతో బైట్‌ డ్యాన్స్‌ విశేషంగా అలరిస్తోందని టెక్నాలజీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యూజర్లకు సరికొత్త గేమ్స్‌, మ్యూజిక్‌ను ప్రవేశపెడుతూ యూజర్లు క్లిక్‌ చేసేలా వ్యూహాలు రచిస్తోంది. చైనీస్‌ స్టార్టప్‌ కంపెనీలలో బైట్‌ డ్యాన్స్‌ చరిత్ర సృష్టించిందని సింగపూర్‌కు చెందిన సాంకేతిక నిపుణుడు కీయాన్‌ విశ్లేషించారు.

click me!